పెళ్లిచూపులుతో ఒక రకమైన ఇమేజ్, అర్జున్‌రెడ్డితో యూత్ ఐకాన్ ఇమేజ్, ఇప్పుడు 'గీతగోవిందం'తో అన్ని తరహా పాత్రల ఇమేజ్‌ను సొంతం చేసుకుని సంచలనాలకు కేంద్రబిందువుగా మారిన స్టార్ విజయ్‌దేవరకొండ, ఈయన ఇమేజ్, క్రేజ్‌ని చూసి తోటి హీరోలే అసూయ పడుతున్నారని చెప్పడం అతిశయోక్తి కాదు. కాగా ఈ చిత్రం ఇప్పుటికే రూ.75కోట్ల క్లబ్‌లోకి చేరింది. మరో వారం రోజుల పాటు ఇదే విధంగా స్టడీ కలెక్షన్స్ సాధిస్తే ఈ చిత్రం 100కోట్ల క్లబ్‌లో చేరడం పెద్ద ఇబ్బంది కాబోదు. ఈ చిత్రం రూ.75కోట్ల క్లబ్‌లో చేరిందని చిత్ర యూనిట్‌తో పాటు బాలీవుడ్ ట్రేడ్ ఎనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ కూడా తెలిపాడు.
మరోవైపు ఈ సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తోన్న విజయ్ దేవరకొండ తాజాగా తన వివాహం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మొదట్లో తాను 40ఏళ్లకు వివాహం చేసుకోవాలని భావించానని, కానీ ఇప్పుడు మాత్రం 35ఏళ్లకే వివాహం చేసుకోవాలని తాను భావిస్తున్నానని తెలిపాడు. దీనికి 'గీతగోవిందం' సక్సెస్ కూడా ఒక కారణమా? అని ప్రశ్నిస్తే అయి ఉండవచ్చు అని సమాధానం ఇచ్చాడు. ఇక తనకు పెద్దలు కుదిర్చిన పెళ్లి సూట్ కాదని, తాను ప్రేమ వివాహమే చేసుకుంటానని ఆయన కుండబద్దలు కొట్టాడు. అమ్మాయి తెలంగాణ అమ్మాయి అయినా కావచ్చు. లేదో ఏదో ప్రాంతం అమ్మాయి అయినా కావచ్చు.
కానీ మేమిద్దరం ముందుగా కనెక్ట్ కావడం ముఖ్యమని ఆయన తెలిపాడు. ఇక వరుసగా హ్యాట్రిక్ హిట్స్ కొట్టి 100కోట్ల దిశగా సాగుతోన్న విజయ్ దేవరకొండతో చిత్రం తీస్తే మినిమం గ్యారంటీ అనే పేరు బాగా వినిపిస్తోంది. దీంతో విజయ్ కూడా తన పారితోషికాన్ని ఏకంగా రూ.10కోట్లకు పెంచాడని సమాచారం. అయినా ఆయనకున్న ఇమేజ్ దృష్ట్యా చూసుకుంటే ఇది పెద్ద మొత్తం ఏమీ కాదనే చెప్పవచ్చు.