Advertisementt

చైతు, సామ్‌లు పోటీపడబోతున్నారా?

Mon 27th Aug 2018 07:27 PM
samantha,naga chaitanya,movies,release,same date  చైతు, సామ్‌లు పోటీపడబోతున్నారా?
Samantha and Naga Chaitanya Movies Release on Same Date చైతు, సామ్‌లు పోటీపడబోతున్నారా?
Advertisement
Ads by CJ

నాగచైతన్య, సమంత.. తెలుగులో స్వీట్‌ కపుల్స్‌లో వీరిపేరు ముందుగా చెప్పుకోవాలి. ఒక విధంగా చూసుకుంటే భర్త నాగచైతన్య కన్నాసమంతకి క్రేజ్‌, ఇమేజ్‌ రెండు ఎక్కువే. ఈమె ఆల్‌రెడీ స్టార్‌ హీరోయిన్‌ హోదాను అనుభవించి యంగ్‌స్టార్స్‌ అందరితో కలిసి ఒకటి రెండుసార్లు స్క్రీన్‌షేర్‌ చేసుకుంది. ఇక ఈమె నటించిన చిత్రాలు కూడా అనేకం 100కోట్ల క్లబ్‌లో చేరాయి. ఇంతకీ విషయం ఏమిటంటే.. ప్రస్తుతం నాగచైతన్య రెండు క్రేజీ ప్రాజెక్ట్స్‌లో పనిచేస్తున్నాడు. ఒకటి మాధవన్‌తో కలసి ఆయన నటిస్తున్న 'సవ్యసాచి' చిత్రం. చందుమొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఖచ్చితంగా విభిన్నచిత్రంగా ఉంటుందని అందరిలో నమ్మకం ఉంది. 

మరోవైపు ఆయన నేటియంగ్‌ డైరెక్టర్స్‌లో కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌ని బాగా పండించగల మారుతి దర్శకత్వంలో 'శైలజారెడ్డి అల్లుడు' చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో అత్తగా రమ్యకృష్ణ నటిస్తుండటం విశేషం. మరి పొరపాటో, గ్రహచారమో తెలియదుగానీ ఈ రెండు చిత్రాలు వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి. ఈ రెండు చిత్రాలను మైత్రి మూవీస్‌, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ వంటి భారీ సంస్థలు నిర్మిస్తుండం విశేసం. 

ఇక 'శైలజారెడ్డి అల్లుడు' చిత్రాన్ని ఈనెల 31న విడుదల చేయాలని భావించారు. కానీ కేరళలో వరదల వల్ల సంగీత దర్శకుడు గోపీసుందర్‌ వర్క్‌ కంప్లీట్‌ కాకపోవడంతో ఈ చిత్రం వాయిదాపడింది. దాంతో ఈ మూవీని వినాయకచవితి కానుకగా సెప్టెంబర్‌ 13వ తేదీన విడుదల చేయాలని భావిస్తున్నారట. విశేషం ఏమిటంటే సమంత లీడ్‌ రోల్‌ని పోషిస్తోన్న కన్నడ రీమేక్‌ యూటర్న్‌ని కూడా అదే తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇవే కనుక ఫిక్స్‌ అయితే భార్యాభర్తల పోరు బాక్సాఫీస్‌ వద్ద ఎలా ఉండబోతోందో వేచిచూడాల్సివుంది. 

Samantha and Naga Chaitanya Movies Release on Same Date:

Competition Between Samantha and Naga Chaitanya

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ