Advertisementt

పూరి కూతురు శిక్షణ తీసుకుంటోంది..!

Mon 27th Aug 2018 05:17 PM
puri jagan,daughter,pavitra,puri jagannadh  పూరి కూతురు శిక్షణ తీసుకుంటోంది..!
Puri Daughter eye on Production House పూరి కూతురు శిక్షణ తీసుకుంటోంది..!
Advertisement
Ads by CJ

ఒకప్పుడు టాప్ డైరెక్టర్ పూరి జగన్నాధ్.. ప్రస్తుతం దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నాడు.. స్టార్ హీరోలే కాదు.. కనీసం మీడియం రేంజ్ హీరోలు కూడా పూరిని తప్పించుకునే స్థితిలో పూరి ప్రస్తుతం ఉన్నాడు. అందుకే హీరోలెవరు ఛాన్స్ ఇవ్వకపోయినా... తన కొడుకు తో సినిమా తీసినా సక్సెస్ కాలేదు... అలాగని పేరు రాలేదు. ఇక ఆయన డైరెక్టర్ అయితే.. కొడుకు ఆకాష్ పూరి హీరో అయ్యాడు. మెహబూబాతో డీసెంట్  హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. నటనలో, డాన్స్ లలో శిక్షణ తీసుకుని మరీ హీరోగా మారాడు. మెహబూబా లో హీరోగా బాగానే మెప్పించినా.. ఆ సినిమాలో కరెక్ట్ కంటెంట్ లేక హిట్ కాలేదు.

ఇక పూరి కూతురు పవిత్ర మాత్రం ప్రస్తుతం సినిమాల వైపు రాలేదు. బుజ్జిగాడు సినిమాలో త్రిష చిన్నప్పటి కేరెక్టర్ లో కాస్త చిన్న బిట్ లో కనబడిన పవిత్ర ప్రస్తుతం చదువుకుంటుంది. అయితే గతంలోనే తనకి హీరోయిన్ గా రావడం ఇష్టం లేదని... నటనలో ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదని చెప్పింది. కానీ సినిమాల్లో పనిచేస్తానని చెప్పింది. టెక్నీకల్ సైడ్ అంటే ఇంట్రెస్ట్ అని చెప్పిన పవిత్ర కి నిర్మాణ రంగం అంటే ఇష్టమట. మరి గతంలోలా కాకుండా ప్రస్తుతం ఇండస్ట్రీలోని హీరోల కూతుళ్లు, హీరోయిన్స్ కూతుళ్లు కూడా హీరోయిన్స్ గా ఎంట్రీ ఇస్తున్నారు. కొంతమంది సక్సెస్ అవుతున్నారు మరికొంతమంది సక్సెస్ కాలేక సైలెంట్ అవుతున్నారు.

ఇక మోహన్ బాబు కూతురు లక్ష్మి మంచు వంటి వాళ్ళు నిర్మాతగా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మరి సక్సెస్ అయినట్లుగా పవిత్ర ప్రొడక్షన్ లో సక్సెస్ అయ్యాక… మంచి అవకాశం వస్తే నటన గురించి ఆలోచిస్తానని చెబుతోంది. బుజ్జిగాడు తర్వాత పవిత్రకు రెండు అవకాశాలు వచ్చినా అంగీకరించలేదట. అమ్మను వాళ్లు ఆ రెండు సినిమాల దర్శక నిర్మాతలు బాగా బతిమాలారు. కానీ ఇష్టం లేకనే మళ్ళీ నటన వైపు వెళ్లలేదని చెబుతుంది పవిత్ర.

Puri Daughter eye on Production House:

Puri Jagan Daughter about acting

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ