Advertisementt

చరణ్ సినిమాపై ఈ వార్త విన్నారా?

Mon 27th Aug 2018 04:37 PM
ram charan,childhood role,touch hearts,boyapati srinu  చరణ్ సినిమాపై ఈ వార్త విన్నారా?
Childhood Charan to Touch Hearts! చరణ్ సినిమాపై ఈ వార్త విన్నారా?
Advertisement
Ads by CJ

వినాయక్ ఒకప్పుడు మాస్ మాస్ అంటూ సినిమాలు తెరకెక్కించి బాగానే సక్సెస్ అయ్యాడు. కానీ ఈ మధ్య కాలంలో వినాయక్ మాస్‌ని ఎవరు చూడడం లేదు. ఆయన సినిమాలకున్న క్రేజ్ మొత్తం పోయింది. ఇక మరో మాస్  డైరెక్టర్ బోయపాటి శీను ఇంకా మాస్ మూసలోనే ఉన్నాడు. బోయపాటి నుండి వచ్చిన సినిమాలేమి కుటుంబ కథ చిత్రాలుగా వుండవు. ఆయన సినిమాల్లో రక్తపాతం, విలన్స్ ని చావగొట్టడం ఎక్కువగా కనిపిస్తాయి. అలాంటి బోయపాటితో రంగస్థలం హిట్ అందుకున్న రామ్ చరణ్ మాస్ చిత్రమెలా చేస్తున్నాడో అన్నారు. కానీ మధ్యలో చరణ్ బోయపాటితో ఈ సినిమాలో అన్ని రసాలు ఉండాలని.. ఈ సినిమాని ఫ్యామిలీ మొత్తం వీక్షించేలా ఉండాలని చెప్పినట్టుగా వార్తలొచ్చాయి.

మరి బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమా కూడా ఊర మాస్ టైప్ లోనే ఉండబోతోందనే టాక్ స్ప్రెడ్ అయ్యింది. మరి రంగస్థలం లాంటి భారీ ఎంటర్టైనర్ ని ఇచ్చిన రామ్ చరణ్ ఇలా ఊర మాస్ పిక్చర్ ఎలా చేస్తున్నాడో అంటూ మెగా ఫాన్స్ కాస్త వర్రీ అవుతున్నారు. అయితే మెగా ఫాన్స్ మిగతా ప్రేక్షకులు అనుకుంటున్నట్టుగా బోయపాటి - రామ్ చరణ్ మూవీ కేవలం మాస్ ఎంటర్టైనర్‌గా మాత్రమే ఉండదట. ఈ సినిమాలో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ ఎమోషన్స్ అన్నీ ఉంటాయట. ఇక చరణ్ ఈ సినిమాలో చిన్న పిల్లాడిగా ఓ పదిహేను నిమిషాల కనిపిస్తాడట.ఆ ఎపిసోడ్ చాలా ఎమోషనల్ గా వుంటుందట.

ఈ కీలక సన్నివేశాలను దర్శకుడు బోయపాటి ప్రేక్షకుల మనసుకు హత్తుకునేలా చిత్రీకరిస్తున్నాడట. ఈ ఎపిసోడ్ సినిమాకే హైలెట్ గా వుంటుందట. మరి ఫ్యామిలీ ఎంటెర్టైనెర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో తమిళ హీరో ప్రశాంత్ రామ్ చరణ్ అన్నగా, ఆర్యన్ రాజేష్ నెగటివ్ షేడ్స్ ఉన్న కేరెక్టర్ లోను, కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాని డివివి దానయ్య నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమా సంక్రాంతి టార్గెట్ గా తెరకెక్కుతుంది. 

Childhood Charan to Touch Hearts!:

Ram Charan‘s Childhood Role to Touch Hearts!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ