డా.రాజశేఖర్ గత ఏడాది నటించిన ‘పి.ఎస్.వి.గరుడవేగ’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. పవర్‌ఫుల్ రోల్స్‌తో తనకంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న కథానాయకుడు డా.రాజశేఖర్ హీరోగా.. అ! వంటి విలక్షణమైన చిత్రాన్ని తెరకెక్కించిన వినూత్న దర్శకుడు ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో రూపొందుతున్న చిత్రానికి కల్కి అనే టైటిల్‌ను ఖరారు చేశారు. శివానీ శివాత్మిక మూవీస్ బ్యానర్ సమర్పణలో హ్యపీ మూవీస్ పతాకంపై రూపొందనున్న ఈ చిత్రాకి సి.కల్యాణ్, శివానీ రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్ నిర్మాతలు.
రాఖీ పౌర్ణమి సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ను చిత్ర యూనిట్ అధికారికంగా అనౌన్స్ చేసింది. అలాగే మోషన్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుండి ప్రారంభం అవుతుంది. మిగతా నటీనటుల వివరాలను త్వరలోనే తెలియజేస్తారు.