దర్శకుడు క్రిష్ గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా తర్వాత బాలీవుడ్ లో కంగనా రనౌత్ మెయిన్ లీడ్ లో ఝాన్సీ లక్ష్మి భాయ్ జీవిత చరిత్రను ఎంతో ఇష్టపడి మణికర్ణిక గా తెరకెక్కించాడు. మణికర్ణిక షూటింగ్ కంప్లీట్ అయ్యి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉండగా... పోస్ట్ ప్రొడక్షన్ పనులు లేట్ కావడంతో దర్శకుడు క్రిష్ తెలుగులో బాలకృష్ణ హీరోగా మహోన్నత వ్యక్తి సీనియర్ ఎన్టీఆర్ బయోపిక్ ఎన్టీఆర్ సినిమాని డైరెక్ట్ చెయ్యడానికి గత నెలలోనే టాలీవుడ్ కి వచ్చేసాడు. అయితే సకాలంలో పూర్తి కావాల్సిన మణికర్ణిక సినిమా టైం కి పూర్తి కాక ఈ ఏడాది విడుదల కావాల్సింది వచ్చే ఏడాది జనవరి పోస్ట్ పోన్ అయ్యింది.
అయితే దర్శకుడు క్రిష్ మణికర్ణికా పోస్ట్ ప్రొడక్షన్స్ ని ముంబై వెళ్లి చూసుకోవడమే కాదు.. ముంబై నుండి హైదరాబాద్ కి హైదరాబాద్ నుండి ముంబై కి ఎక్కే ఫ్లైట్ ఎక్కి దిగే ఫ్లైట్ దిగుతున్నాడు. కానీ ఈలోపులో క్రిష్ మణికర్ణికని గాలికొదిలేసాడు.... మణికర్ణికని పక్కన పెట్టేసి ఎన్టీఆర్ బయోపిక్ ని ఇంట్రెస్టింగ్‌గా తీస్తున్నాడు క్రిష్ అంటూ ప్రచారం మొదలైంది. ఇక తాజాగా అయితే మణికర్ణిక పోస్ట్ ప్రొడక్షన్ పనులను కంగనా దగ్గరుండి చూసుకుంటూ... క్రిష్ ని పక్కన పెట్టేసి అన్ని తానై మణికర్ణికకు పని చేస్తుందని... క్రిష్ ని కంగనా రనౌత్ అవమానిస్తుందని.. ఇలా రకరకాల పుకార్లు సోషల్ మీడియాలో ప్రచారంలోకి వచ్చాయి. అయితే కంగనా ముక్కు సూటి మనిషి గనక క్రిష్ తో నిజంగానే విభేదించి ఉండొచ్చనే చాలామంది ఫిక్స్ అయ్యారు.
అయితే ఇప్పుడు కంగనా... క్రిష్ కి తనకి మధ్యన ఎటువంటి విభేదాలు లేవని... టాలీవుడ్ లో క్రిష్ తెరకెక్కిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ క్రిష్ కి చాలా ఇంపార్టెన్స్ అని... అంతేకాని క్రిష్ మణికర్ణికని ఏమి వదిలెయ్యలేదని కంగనా... తనకి క్రిష్ కి మధ్య వస్తున్న పుకార్లకు చెక్ పెట్టె ప్రయత్నం చేసింది. మరి క్రిష్ కి కంగనా చెప్పినట్లు ఎన్టీఆర్ బయోపిక్ మాత్రమే ఇంపార్టెంటా.. మణికర్ణిక కోసం తీవ్రంగా కష్టపడ్డానని.... అదే నా సర్వస్వం అని చెబుతున్న కంగనా మణికర్ణిక సినిమా ఇంపార్టెన్స్ కాదా అంటూ క్రిష్ మీద సెటైర్స్ పడుతున్నాయి. మరి షూటింగ్ పూర్తయ్యి ఆరు నెలలయింది.. మణికర్ణిక గ్రాఫిక్స్ వర్క్ ఇంతవరకు ఒక కొలిక్కి రాలేదు. ఈ టైం లో దర్శకుడికి హీరోయిన్ కి విభేదాలంటే సినిమా మీద క్రేజ్ తగ్గే ఛాన్స్ ఉంది కనకనే కంగనా ఇలా ఒక మీడియా కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టె ప్రయత్నం చేసింది అని అంటున్నారు.