Advertisementt

ఇద్దరికీ ఈ చిత్రం ఎంతో కీలకం..!

Sun 26th Aug 2018 01:35 PM
trisha,vijay sethupathi,96 teaser  ఇద్దరికీ ఈ చిత్రం ఎంతో కీలకం..!
96 teaser Released ఇద్దరికీ ఈ చిత్రం ఎంతో కీలకం..!
Advertisement
Ads by CJ
నటిగా త్రిష గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తెలుగులో సీనియర్‌ స్టార్స్‌ నుంచి జూనియర్‌ ఎన్టీఆర్‌, ప్రభాస్‌ నుంచి సిద్దార్ద్‌ వరకు అందరిని ఓ రౌండ్‌ వేసింది. ఇక ఈమె తెలుగులోనే కాదు తన మాతృభాష తమిళంలో కూడా తన హవా కొనసాగించింది. ఆ తర్వాత ఫేడవుట్‌ అవుతున్న తరుణంలో తమిళ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌, ఫైనాన్షియర్‌తో నిశ్చితార్దం కూడా జరిగింది. కానీ అది ఆయన బ్యాడ్‌లక్కో లేక త్రిష గుడ్‌లక్కో తెలియదు గానీ ప్రభుదేవాతో వివాహం చెడిపోయిన తర్వాత ప్రభుదేవా కనుమరుగవుతుంటే నయనతార లేడీ సూపర్‌స్టార్‌ స్థాయికి ఎదిగినట్లుగా నిశ్చితార్దం ఆగిపోగానే త్రిష మరలా ఎవ్వరూ ఊహించని అనూహ్యరీతిలో బిజీబిజీ అయింది. ఎంతలా అంటే అంతకు ముందు ఒప్పుకున్న 'సామి స్క్వేర్‌' వంటి చిత్రంలో కీర్తిసురేష్‌ కంటే తనకు ఎక్కువ ప్రాధాన్యం లేదని సినిమా నుంచి బయటికి వచ్చేలా ఆమె హవా సాగుతోంది. 
అయితే ఈమెకి లేడీ ఓరియలంటెడ్‌ చిత్రాలు మాత్రం పెద్దగా కలిసి రావడం లేదు. మరోవైపు కోలీవుడ్‌లో విజయ్‌సేతుపతి తన సత్తా చాటుతున్నాడు. చేసే ప్రతి చిత్రం విలక్షణంగా ఉండేలా చూసుకుంటున్నాడు. దాంతోనే ఆయనకున్న క్రేజ్‌ 'సై..రా..నరసింహారెడ్డి'కి కోలీవుడ్‌లో ఉపయోగపడుతుందన భావించి ఆ చిత్రంలో ఆయనను కీలకపాత్రకు తీసుకునే దాకా ఆయన హవానడుస్తోంది. కానీ తెలుగు వారికి పెద్దగా పరిచయం లేని విజయ్‌ సేతుపతి 'సై..రా' కంటే ముందే తెలుగులో సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నాడు. 
ఇక విషయానికి వస్తే తాజాగా త్రిష, విజయ్‌సేతుపతిలు కలిసి ‘96’ అనే విభిన్న చిత్రంలో నటించారు. టైటిల్‌ నుంచే అందరికీ ఆకర్షిస్తున్న ఈ చిత్రం ట్రైలర్‌ తాజాగా విడుదలైంది. నందగోపాల్‌ నిర్మాతగా, ప్రేమ్‌ కుమార్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈనెల 31న విడుదల కానుంది. ఫ్లాష్‌బ్యాక్‌ సన్నివేశాలను, ప్రస్తుతం జరుగుతున్న సన్నివేశాలను జోడిస్తూ ట్రైలర్‌ని ఎంతో బాగా కట్‌ చేశారు. 
త్రిష ఇప్పటికీ ఎంతో గ్లామర్‌గా ఉండగా, విజయ్‌సేతుపతి కొత్త గెటప్‌లో ఆకట్టుకుంటున్నాడు. వీరిద్దరు ఈ చిత్రం తెలుగులో కూడా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నారు..సో.. ఓ విధంగా చూసుకుంటే ఈ ఇద్దరికి ఈ చిత్రం అత్యంత కీలకమనే చెప్పాలి. 

96 teaser Released:

Trisha and Vijay sethupathi movie 96 teaser released

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ