గట్స్ విషయానికి వస్తే చిరంజీవి కంటే పవన్‌కళ్యాణ్, రజనీకాంత్ కంటే కమల్‌హాసన్‌లు ముందు వరుసలో ఉంటారని చెప్పవచ్చు. ఫలితం దేవుడు నిర్ణయిస్తాడు. ముందుగా తామనుకున్న పనిని వెంటనే ప్రారంభించే విషయంలో చిరంజీవి, రజనీ వంటి వారు పదికి వందసార్లు ఆచితూచి స్పందిస్తారేమోగానీ పవన్, కమల్‌లు అలా కాదు. ఇక కమల్ విషయానికి వస్తే ఆయన సొంత పార్టీ పెట్టిన తర్వాత రాజకీయంగా చురుగ్గా ఉంటున్నాడు. కేంద్రంలోని బిజెపిని, రాష్ట్రంలో అధికారంలో ఉన్న అన్నాడీఎంకేను తూర్పారపడుతున్నాడు. త్వరలో తాను మరింత యాక్టివ్‌గా పనిచేయనున్నానని ప్రకటించాడు. ఇదే విషయంలో రజనీ ఇంకా విషయాన్ని నాన్చుతూనే మూడడులు ముందుకు.. ఆరడగులువెనక్కు వేస్తున్నాడు.
ఇక కమల్ చెన్నైలోని అతి రద్దీ ప్రదేశమైన అళ్వార్‌పేట ఎల్డామ్స్‌రోడ్డులో ఏళ్లతరబడి ఉంటున్నాడు. ఆ ప్రాంతం ఎంత రద్దీ అంటే ఎవ్వరూ కనుగప్పి ఆ ఇంట్లోకి ప్రవేశించే చాన్స్ కూడా ఉండదు. కమల్ నటునిగా ఉన్నప్పుడు ఆయన ఆజ్ఞలేనిదే చీమ కూడా లోపలికి వచ్చేది కాదు. ఇక ఇంట్లో కొంత భాగాన్ని ఆయన ప్రస్తుతం తన పార్టీ కార్యకలాపాలకు వినియోగిస్తున్నాడు. రెండు నెలల కిందట ఓ వ్యక్తి ఈ ఇంట్లోకి అక్రమంగా చొరబడి పోలీస్‌ల అదుపులోకి వచ్చి జైలు పాలయ్యాడు.
తాజాగా మరో వ్యక్తి తెల్లవారుజామున 3.30 నిమిషాలకు కమల్ ఇంట్లోకి చొరబడ్డాడు. తనను కమల్ కలవమని పిలిచాడని సెక్యూరిటీకి చెప్పాడు. కానీ సెక్యూటినీ నమ్మలేదు. దాంతో ఇనుప గేటుని దాటి ఇంట్లోకి ప్రవేశించాడు. సెక్యూరిటీ రావడంతో సోఫాలో కూర్చుండిపోయాడు. సెక్యూరిటీ బయటికి వెళ్లమంటే సోఫాలో పడుకున్నాడు. తాను కమల్ అభిమానినని, కార్యకర్తనని తలో మాట చెబుతు వచ్చాడు. దీంతో తేనాంపేట పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. ఈయన రామనాధంపురం జిల్లాకు చెందిన మలైస్వామిగా పోలీసులు గుర్తించారు. ఇటీవల కాలంలో కమల్ విమర్శల పట్ల అన్నాడీఎంకే, బిజెపి నేతలు తీవ్రమైన హెచ్చరికలు చేస్తున్న నేపథ్యంలో దీని వెనుక ఎవరి హస్తమైనా ఉందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.