Advertisementt

'2.ఓ'కి ఏదీ కలిసి రావడం లేదు..!

Sat 25th Aug 2018 03:23 PM
shankar,rajinikanth,amy jackson,2.0  '2.ఓ'కి ఏదీ కలిసి రావడం లేదు..!
2.0 Video Song Leaked '2.ఓ'కి ఏదీ కలిసి రావడం లేదు..!
Advertisement
Ads by CJ

శంకర్‌ కెరీర్‌లో భారీ అంచనాలతో మొదలై సరైన ఫలితం సాధించలేకపోయిన చిత్రంగా 'ఐ' చిత్రాన్ని చెప్పుకోవచ్చు. ఈ చిత్రం విడుదలకు కూడా ఎన్నో అవాంతరాలు ఎదురయ్యాయి. మరి దీనిని శంకర్‌ టైం బాగాలేదని చెప్పాలా? మరో విధంగా అర్ధం చేసుకోవాలా? అనేది అర్ధం కాని విషయం. ఇక ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా 'బాహుబలి'ని మించిన రేంజ్‌లో తీయాలని కలలు గన్న '2.ఓ'చిత్రం ప్రారంభమై ఏళ్లకు ఏళ్లు గడుస్తోంది. రిలీజ్‌ డేట్స్‌ మారుతున్నాయే గానీ సినిమా మాత్రం విడుదల కావడం లేదు. బడ్జెట్‌ చూస్తే భారీగా ఉంది. మరీ శంకర్‌ దీని కోసం అతి జాగ్రత్తలు, అతిశ్రద్ద చూపిస్తున్నాడా? తన రేంజ్‌ని మించిన ప్రాజెక్ట్‌ను చేయాలనే ఉబలాటమే ఆయనకు ఇలాంటి గడ్డుపరిస్థితులు తీసుకుని వస్తోందా? అనేది కూడా అర్ధం కాని విషయం.

గ్రాఫిక్స్‌, వీఎఫ్‌ఎక్స్‌లను అప్పగించిన సంస్థ దివాళా తీసింది. దాంతో ఈ బాధ్యతలను మరో సంస్థకు అప్పగించాడు. నిర్మాతలకు,శంకర్‌కి కూడా అభిప్రాయ భేధాలు వచ్చాయని కోలీవుడ్‌ మీడియా అంటోంది. శంకర్‌ మరీ ఏళ్లకు ఏళ్లు తీస్తుండటంతోనే కమల్‌హాసన్‌ కూడా తానుశంకర్‌ దర్శకత్వంలో చేయాలని భావించిన 'భారతీయుడు2'ని పక్కనపెట్టాడన, దిల్‌రాజు కూడా అందుకే ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్నాడని సమాచారం. జాగ్రత్త మంచిదే గానీ నిర్మాతల శ్రేయస్సును కూడా శంకర్‌ పరిగణనలోకి తీసుకోవాలి. లేదంటే మరోసారి లైకా ప్రోడక్షన్స్‌ సంస్థ కూడా ఆస్కార్‌ రవిచంద్రన్‌లా చేతులెత్తే పరిస్థితి ఏర్పడవచ్చు. 

ఇక ఈ చిత్రం టీజర్‌ని విడుదల చేయాలని భావిస్తున్న తరుణంలో ఈ టీజర్‌ కూడా లీక్‌ అయింది. తాజాగా శంకర్‌కి మరో షాక్‌ తగిలింది. ఈ సినిమాకి సంబంధించి బిబిసీ సంస్థ చేస్తున్న డాక్యుమెంటరీలోని రెండు నిమిషాల మేకింగ్‌ వీడియో లీక్‌ అయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. రజనీ, అమీజాక్సన్‌లకి సంబంధించిన పాట తాలూకు వీడియో లీక్‌ కావడం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. మరి ఈ చిత్రం అనుకున్న విధంగా నవంబర్‌లోనైనా విడుదల అవుతుందా? లేక రజనీ 'కాలా' ముందుగా విడుదలైనట్లు కార్తీక్‌సుబ్బరాజుతో చేస్తున్న చిత్రం కూడా విడుదలయ్యే దాకా '2.ఓ'కి ఇబ్బందులు తప్పవా? అనే సందేహాలు అందరిలో మెదులుతున్నాయి. 

2.0 Video Song Leaked:

2.0 Video Song Leaked

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ