బిగ్‌బాస్ సీజన్2 ఇంతకాలానికి ఓ రేంజ్‌లో ఆకట్టుకుంది. దీనికి కారణం 'రంగస్థలం'లో రంగమ్మత్తగా నటించిన అనసూయ బిగ్‌బాస్ హౌస్‌లో సందడి చేయడమే. ఈమె అతిధిగా వస్తేనే ఇంత హంగామా సృష్టించింది. అదే ఈమె పార్టిసిపెంట్ అయితే ఇంకేమైనా ఉందా? అనే పాయింట్‌ని అందరిలో మొలకెత్తేలా చేసింది. 73వ ఎపిసోడ్‌లో ఈమె గ్రీన్‌కలర్ శారీతో బిగ్‌బాస్ హౌస్‌సభ్యుల హృదయాలను సైతం కొల్లగొట్టింది. ఈ ఎపిసోడ్‌లో బిగ్‌బాస్ హౌస్‌ని పెళ్లి వేదికగా మార్చివేశారు. రాధాకృష్ణ,మధులత గ్రూప్‌లు వధూవరుల టీంలకు ప్రాతినిధ్యం వహించాయి.మంగళ వారం మెహందీ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి రంగమ్మత్త రావడం మరింత శోభని చేకూర్చింది. పురోహితుడుగా గణేష్ వ్యవహరించాడు. టాస్క్‌లో భాగంగా ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు.
మొదటగా బిగ్‌బస్ వరుడు వారికి టాస్క్ ఇచ్చాడు. స్మిమ్మింగ్‌పూల్‌లో ఉంగరాలను వెలికితీయాలని చెప్పాడు. సామ్రాట్, దీప్తిలు ఈ టాస్క్‌ని పూర్తి చేశారు. అమ్మాయి తరపు వారికి బిగ్‌బాస్‌లో దాచిన చెప్పుల జతలను కనిపెట్టి వెలికితీయాలని ఆదేశించాడు. అమిత్, గీతామాధురి, గణేష్, తనీష్, పూజ కష్టపడి 20జతల చెప్పులు వెలికి తీశారు. వధువు కుటుంబీకులు లడ్డులు చుట్టాలని, వరుడు కుటుంబీకులు దుప్పట్టాలు సర్దాలని బిగ్ బాస్ కోరాడు. ఇంతలో బిగ్‌బాస్ హౌస్‌లో రారండోయ్ వేడు చూద్దాం.. పాట వినిపించడంతో సభ్యులలో కొత్త ఉత్సాహం నెలకొంది. అదే సమయంలో అనసూయ తాంబూలంతో హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అందరినీ పేరుపేరునా పలకరించింది. వధూవరుల్లో ఎవరి తరపున ఉంటారని ప్రశ్నించగా తనకు ఇద్దరు కొడుకులే కావున వధువు తరపునే ఉంటానని నవ్వులుపూయించింది. బుధవారం సంగీత్, పెళ్లి వేడుకల్లో రంగమ్మత మరెంత సందడి చేయనుందో వేచిచూడాల్సివుంది...!