రేపు శుక్రవారం విడుదలకానున్న ఆది పినిశెట్టి - తాప్సి - రీతూ సింగ్ కాంబోలో తెరకెక్కిన నీవెవరో సినిమాకి ట్రేడ్ లో పెద్దగా బజ్ లేదు. ఈ సినిమా మీద భారీ అంచనాలైతే లేవు. కానీ ప్రమోషన్స్ విషయంలో నీవెవరో టీమ్ హీరోయిన్స్ ఇంటర్వూస్ ఇప్పిస్తున్న సినిమా మీద ప్రేక్షకుల్లో పెద్దగా ఆసక్తి కలగడం లేదు. ఆఖరుకి తాప్సి క్రేజ్ కూడా సినిమా మీద హైప్ పెంచలేకపోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో కోన వెంకట్ ఎన్ని రకాలుగా ఎత్తులు వేసి కొత్తగా ప్రయత్నిస్తున్నప్పటికీ... సినిమా మీద మాత్రం క్రేజ్ పెంచలేకపోతున్నారు. ఆఖరుకి నిన్న రామ్ చరణ్ చేతుల మీదుగా నీవెవరో సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు.
ఇక ట్రైలర్ లో ఎక్కువగా వెన్నెల కిషోర్ ఉన్న సీన్స్ తో ట్రైలర్ ని కట్ చేశారు. ప్రస్తుతం వెన్నెల కిషోర్ నటించిన సినిమాలన్నీ వరసబెట్టి హిట్ అవడం.. వెన్నెల కామెడీకి స్పెషల్ గా చప్పట్లు కొడుతున్నారు ప్రేక్షకులు. అందుకే ప్రస్తుతం పెద్దగా బజ్ లేని నీవెవరో సినిమా మీద వెన్నెల కిషోర్ తో సినిమా మీద బజ్ పెంచాలనే ఉద్దేశ్యంతోనే.. నీవెవరో ట్రైలర్ మొత్తం వెన్నెల పోలీస్ ఆఫీసర్ గా వున్న సీన్స్ తో కట్ చేసి సినిమా మీద కాస్త క్యూరియాసిటీ కలిగేలా చేశారు. తాజాగా వచ్చిన గీత గోవిందం సినిమాలో వెన్నెల కిషోర్ రష్మికను పెళ్లి చేసుకునే పెళ్లికొడుకులా బఫున్ పాత్రలో మెప్పించాడు.
ఒక మర్డర్ కు సంబంధించిన పాయింట్ చుట్టూ కథ రాసుకున్న ఈ సినిమాలో ఆది పినిశెట్టి అంధుడిగా కనిపించబోతున్నాడు. ఇక ఆది పినిశెట్టి ఒక మర్డర్ కేసులో ఇరుక్కోవడం.. ఆ కేసు విచారణ చేసే పోలీసుగా వెన్నెల కిషోర్ నటించాడు. మరి సినిమా మీద వెన్నెల ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుందో తెలియదు గాని.. సినిమా విడుదలై దాదాపుగా ఎనిమిది రోజులు కావొస్తున్నా విజయ్ దేవరకొండ నటించిన గీత గోవిందం ఊపు మాత్రం తగ్గలేదు. అందుకే రేపు శుక్రవారం విడుదల కాబోతున్న సినిమాలకు గీత గోవిందం టెంక్షన్ అయితే పట్టుకుంది.