పవన్‌కళ్యాణ్ హీరోగా నటించిన మొదటి చిత్రంలో ఆయన స్క్రీన్‌నేమ్ కళ్యాణ్‌బాబు. ఆ తర్వాత ఆయన పవన్‌కళ్యాణ్‌గా మారిన తర్వాతే స్టార్‌డమ్ వచ్చింది. ఇక ఈయన హీరోగా నటించిన మొదటి చిత్రం ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన 'అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి'. ఇందులో హీరోయిన్‌గా అక్కినేని నాగేశ్వరరావు మనవరాలు సుప్రియా నటించింది.
ఆమె తాజాగా మాట్లాడుతూ.. ఆ చిత్రం విశేషాలను చెప్పుకొచ్చింది. 'అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి' చిత్రంలో మెగస్టార్ చిరంజీవి సోదరుడు పవన్‌కళ్యాణ్ హీరోగా, అక్కినేని మనవరాలినైన నేను హీరోయిన్‌గా నటించడం వల్ల ఆ చిత్రంపై మంచి ఆసక్తి, అంచనాలు ఏర్పడ్డాయి. మా ఇద్దరికి అదే మొదటి సినిమా కావడంతో అంతా కొత్తకొత్తగా ఉండేది. పవన్‌కళ్యాణ్ చాలా సిగ్గరి. పిలిచి నా పక్కన కూర్చోమన్నా కూర్చునే వాడు కాదు. ఈ సినిమా షూటింగ్ సమయంలో సమ్మె వల్ల అందరి డేట్స్‌మారిపోతూ వచ్చాయి. మొదటి చిత్రం కావడంతో పవన్ చాలా టెన్షన్ పడ్డాడు. ఈ సినిమా కోసం ఆయన ఎంతో కష్టపడ్డారు. ఆయన చేతులు మీదుగా వరుసగా కార్లు వెళ్లే సీన్‌ని డూప్‌షాట్‌గా తీస్తారని అనుకున్నాను.
కానీ పవన్ చేతుల మీదుగా నిజంగానే కార్లు వెళ్లాయి. అది చూసి నా కళ్లవెంట నీళ్లు వచ్చాయి. ఇప్పటికీ ఆయన నాకు మంచి స్నేహితుడు అని చెప్పుకొచ్చింది. ఇంక ఇంతకాలం తర్వాత ఆమె తాజాగా అడవిశేష్ నటించిన సూపర్‌హిట్ మూవీ 'గూఢచారి'లో కీలకమైన పాత్రను చేయగా, పవన్ రాజకీయాలలో బిజీగా ఉన్నాడు.