Advertisementt

గీతగోవిందం నిర్మాత ఎందుకు హ్యాపీగా లేడు?

Thu 23rd Aug 2018 03:24 PM
bunny vasu,geetha govindam,producer,unhappy,success  గీతగోవిందం నిర్మాత ఎందుకు హ్యాపీగా లేడు?
Geetha Govindam Producer unhappy with Movie big Success గీతగోవిందం నిర్మాత ఎందుకు హ్యాపీగా లేడు?
Advertisement
Ads by CJ

విజయ్ దేవరకొండ, పరశురామ్ కాంబోలో లేటెస్ట్ గా తెరకెక్కిన గీత గోవిందం సినిమా గత బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా చిన్న సినిమాగా విడుదలై అదరగొట్టే హిట్ అందుకుంది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న సినిమాని తమ భుజాల మీద మొయ్యడమే కాదు... ఈ సినిమా విజయంలో కీలక పాత్రలు పోషించారు. దర్శకుడు ఎంత బాగా సినిమా తీసిన హీరో కరెక్ట్ గా ఫాలో అయితేనే ఆ సినిమా హిట్ అవుతుందని గీత గోవిందంలో విజయ్ దేవరకొండ నిరూపించాడు. సినిమాలో హీరోయిజం, కామెడీ, యాక్షన్ అన్ని విజయ్ దేవరకొండ చేసేసి థియేటర్స్ లో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేశాడు. చాలా తక్కువ బడ్జెట్ తో గీత ఆర్ట్స్ బ్యానర్ లో బన్నీవాసు ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఇప్పుడు చూస్తే ఈ సినిమా పెట్టిన పెట్టుబడికి ఐదారు రేట్ల లాభాలను తీసుకొస్తుంది. ఇప్పటికి స్టడీ కలెక్షన్స్ తో గీత గోవిందం సూపర్ హిట్ కాదు కాదు బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది.

ఈ సినిమాలో విజయ్ దేవరకొండ నటనకు, పెట్టిన పేస్ ఎక్సప్రెషన్స్ కి చేసిన కామెడీకి అన్నిటీకి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతూ ఈ సినిమాకి రిపీటెడ్ ఆడియన్స్ ఉంటున్నారు. అందుకే ఈ సినిమా ఇప్పటికీ మంచి కలెక్షన్స్ తెచ్చుకుంటుంది. అయితే ఈ సినిమా బిజినెస్ ని ఈ సినిమా నిర్మాత బన్నీవాసు కొద్దిగా లాభాలతో అమ్మేశాడు. అయితే సినిమాకి కొద్దిగా లాభాలు మాత్రమే మూటగట్టుకున్న బన్నీవాసు ఇప్పుడు హ్యాపీగా లేడు. ఎందుకంటే గీత గోవిందం సూపర్ హిట్ అవడం... ఈ సినిమాని కొన్న బయ్యర్లకు లాభాల పంట పండడం చూస్తుంటే బన్నీవాసు అన్ హ్యాపీ అనే టాక్ వినబడుతుంది. ఈ సినిమా ఈ రేంజ్ హిట్ పడుతుందని బన్నీవాసు అస్సలు ఊహించకే.. సినిమాని కొద్దిగా టేబుల్ ప్రాఫిట్ కి అమ్మేశాడు.

కానీ సినిమా విడుదలై సెన్సేషన్ హిట్ అవడమే కాదు... కొన్నవారికి లాభాల పంట పండిస్తోంది. అందుకే ఎందుకు తక్కువ రేట్లకి సినిమాని అమ్ముకున్నానా.. ఇప్పుడు చూడండి ఏ రేంజ్ లాభాలొస్తున్నాయో అని సన్నిహితుల వద్ద బన్నీ వాసు వాపోతున్నాడట. ఇప్పుడనుకుని ఏం లాభం. అయినా దిల్ రాజు చెప్పినట్టుగా... 40 రూపాయల అడ్వాన్స్ నుండి 40 కోట్ల నిర్మాతగా బన్నీవాసుకి మంచి పేరైతే గీత గోవిందంతో వచ్చింది.

Geetha Govindam Producer unhappy with Movie big Success:

Why Geetha Govindam Producer in unhappy?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ