ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో జన్మించిన నటి లావణ్యత్రిపాఠి. ఈమె మోడల్‌గా, టివి షోలు, నటిగా కూడా రాణించింది. తెలుగులో తొలి చిత్రంగా 'అందాల రాక్షసి' చేసి అందాల రాక్షసిగానే ముద్దుగా పిలుచుకునేలా చేసింది. ఇక ఈమె 'మనం, సోగ్గాడే చిన్నినాయనా, శ్రీరస్తు...శుభమస్తు, దూసుకెళ్తా, భలే భలే మగాడివోయ్' వంటి హిట్స్‌ని తన ఖాతాలో వేసుకుంది. దాంతో ఈమె టాప్ హీరోయిన్‌గా ఎదగడం ఖాయమని పలువురు భావించారు. కానీ ఆ తర్వాతే ఆమె గాడి తప్పింది. 'మిస్టర్, రాధా, యుద్దం శరణం, లచ్చిదేవికో లెక్కుంది, ఉన్నది ఒకటే జిందగీ, ఇంటెలిజెంట్' వంటి వరుస ఫ్లాప్ చిత్రాలలో నటించింది.
ఇక ఈమె తెలుగులో సెటిల్ కాకుండానే తన దృష్టిని కోలీవుడ్‌పై కూడా పెట్టింది. కానీ అక్కడ కూడా వివాదాలతో కాలక్షేపం చేసింది. తెలుగులో నాగచైతన్య, తమన్నా జంటగా వచ్చిన సూపర్‌హిట్ చిత్రం '100%లవ్'కి రీమేక్‌గా తమిళంలో రూపొందుతున్న '100% కాదల్'లో తమన్నాకి తెలుగులో మంచి పేరు తెచ్చిన మహాలక్ష్మి పాత్రను చేస్తానని చెప్పి మరీ అడ్వాన్స్ తీసుకుని ఆ చిత్రం నుంచి తప్పుకుంది. దీనిపై ఆ చిత్రం నిర్మాతలు ఆమె వల్ల చాలా నష్టపోయామని నిర్మాతల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఇక ఈమెకి తాజాగా విడుదలైన 'గీతగోవిందం'లో కూడా మొదట చాన్స్ వచ్చింది. గీతాఆర్ట్స్ తీసిన 'శ్రీరస్తు..శుభమస్తు' చిత్రంలో ఈమె నటించడం, దానికి కూడా పరశురామే దర్శకుడు కావడం, సినిమా బాగా ఆడటంతో ఆమెపై ఫొటో షూట్ కూడా చేశామని, కానీ చివరి క్షణాల్లో ఆమె తప్పుకోవడం వల్ల రష్మికా మందన్నను తీసుకున్నామని స్వయంగా దర్శకుడు పరశురామే వెల్లడించాడు.
గీతాఆర్ట్స్, పరశురామ్, ముఖ్యంగా అర్జున్‌రెడ్డితో సంచలనం సృష్టించిన విజయ్ దేవరకొండ చిత్రం నుంచి ఆమె తప్పుకుని పెద్ద పొరపాటు చేసింది. అంతేకాదు.. ఈ ఏడాది పెద్ద హిట్‌గా నిలిచిన వరుణ్‌తేజ్, వెంకీ అట్లూరిల 'తొలిప్రేమ'లో కూడా మొదట లావణ్యత్రిపాఠీనే తీసుకున్నారట. ఆమె కాదనడంతోనే రాశిఖన్నాని తీసుకున్నారు. ఇలా వరుసగా ఆమె రెండు భారీ విజయాలు సాధించిన చిత్రాలు వదులుకోవడం ఆమె జడ్జిమెంట్ లోపమేనని చెప్పాలి.