వరుస విజయాలు, ఆయన పేరెత్తితేనే యువత పిచ్చెక్కిపోతున్నారు... అతి తక్కువ చిత్రాలతోనే స్టార్‌గా దూసుకుపోతున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే టాప్‌స్టార్‌తో సమానంగా ఈయన ఆడియన్స్‌కి పిచ్చెక్కిస్తున్నాడు. ఈయన తెరమీదే కాదు.. పోస్టర్ మీద కనిపించినా కూడా వసూళ్లు మోత మోగుతున్నాయి. పవన్‌కళ్యాణ్‌కి కెరీర్ ప్రారంభంలో ఎలా హిట్స్ వచ్చి జనాలను పిచ్చెక్కించాడో విజయ్‌దేవరకొండ కూడా అదే విధంగా సాగుతున్నాడు. దాంతో ఆయన్ను అందరు మరో పవన్‌కళ్యాణ్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఏకంగా మెగాస్టార్ చిరంజీవి 'గీతగోవిందం' బ్లాక్‌బస్టర్‌తో విజయ్ అగ్రనటుల జాబితాలో చేరిపోయినట్లేనని కాంప్లిమెంట్ ఇచ్చాడు. తెలుగు తెరకి మరో స్టార్ దొరికాడని చిరు అన్న మాటలు వైరల్ అవుతున్నాయి.
ఇక అల్లుఅరవింద్ అయితే విజయ్‌ని ఏకంగా చిరంజీవితో పోల్చేశాడు. చిరంజీవిలా విజయ్ కూడా ఎదుటి వారు చెప్పేది బాగా విని నిర్ణయం తీసుకుంటాడని, విజయ్ మహా తెలివివంతుడే కాదు.. పెద్ద ముదురు అంటూ పొగడ్తల వర్షం కురిపించాడు. కత్తి కాంతారావు, నితిన్‌లలాగా ఈయన తెలంగాణ నుంచి వచ్చిన పెద్ద స్టార్‌గా మారిపోయాడు. నాగర్‌కర్నూల్‌కి చెందిన ఈ కుర్రాడు మొత్తానికి నక్కతోక తొక్కాడనే చెప్పాలి. ఇక గీతగోవిందం చిత్రాన్ని కేవలం బ్లాక్ బస్టర్ అనలేం. ఇది డబుల్ బ్లాక్‌బస్టర్. మొదటి రోజే 10కోట్ల షేర్‌ని సాధించి స్టార్స్ చిత్రాలతో పోటీగా కలెక్షన్లు సాధిస్తోంది. బుధవారం విడుదలైన తర్వాత వీక్ డేస్‌తో పాటు వీకెండ్‌తో కలిపి ఐదు రోజుల్లోనే దాదాపు 33 కోట్ల షేర్‌ని వసూలు చేసి పెట్టింది. ఫుల్‌రన్‌లో ఈ చిత్రం 50కోట్ల మార్కును అందుకున్నా ఆశ్చర్యంలేదని అంటున్నారు.
ఇక యూఎస్‌లో కూడా ఈ చిత్రం ఇప్పటికే 1.5మిలియన్ డాలర్లను వసూలు చేసింది. కాగా ఈ చిత్రం మరో రికార్డును సృష్టించింది. అక్షయ్‌కుమార్ నటించిన 'గోల్డ్', జాన్ అబ్రహం నటించిన 'సత్యమేవ జయతే' కంటే ఆస్ట్రేలియాలో ఈ చిత్రం ఎక్కువ మొత్తం రాబట్టింది. ఈ విషయాన్ని బాలీవుడ్ ట్రేడ్ నిపుణుడు తరుణ్ ఆదర్శే తెలిపాడు. ఈ రెండు బాలీవుడ్ చిత్రాలు 'గీతగోవిందం' ముందు నిలబడలేకపోయాయని ఆయన కలెక్షన్లతో సహా తెలపడం బాలీవుడ్‌లో కూడా సంచలనాలకు కారణం అయిందనే చెప్పాలి.