ఆగష్టు తొమ్మిదిన మహేష్ బాబు - వంశీ పైడిపల్లి కాంబోలో తెరకెక్కుతున్న సినిమా టైటిల్ తో పాటుగా మహేష్ బాబు లుక్ అలాగే.. మహర్షి సినిమా టీజర్ ని విడుదల చేశారు. అయితే అప్పట్లో రెండు రోజులు హడావిడి చేసిన అభిమానులు మళ్లీ సైలెంట్ అయ్యారు. ఇక మహర్షి మూవీ షూటింగ్ కూడా డెహ్రాడూన్, గోవా పరిసర ప్రాంతాల్లో సైలెంట్ గా నిర్విరామంగా సాగుతూనే ఉంది. ఇక మహేష్ మహర్షి మూవీలో రిషిగా, మహర్షి గా రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలో కనబడతాడని... రైతు సమస్యలను పరిష్కరించడానికి విదేశాలనుండి మహేష్ బాబు దిగుతాడని.. విదేశాల నుండి వచ్చిన మహేష్ స్నేహితుడు రవి(అల్లరి నరేష్) సమస్యల పరిష్కారానికి తీసుకున్న నిర్ణయాలు, ఎదుర్కున్న సమస్యలపై ఈ సినిమా కథ ఉండబోతుందంటూ ప్రచారం జరుగుతుంది.
ఇక ఈ సినిమాలో మహేష్ బాబు ఎంబీఏ స్టూడెంట్ లుక్ లో అదరగొడుతున్నాడు. అల్లరి నరేష్ మహేష్ స్నేహితుడిగా కనబడనున్న ఈ సినిమాలో పూజ హెగ్డే సాఫ్ట్ వెర్ ఇంజినీర్ గా నటిస్తుందని టాక్ ఉంది. ఇకపోతే ఈ సినిమాలో మహేష్ కి తల్లిగా అలనాటి మేటి హీరోయిన్ సీనియర్ నటి జయప్రద నటిస్తుందట. గతంలో బాలకృష్ణ సినిమాలో మీరా జాస్మిన్, స్నేహ కి తల్లిగా నటించిన జయప్రద మళ్ళీ ఇన్నాళ్ళకి మహేష్ చిత్రంతో టాలీవుడ్ లోకి వస్తుంది. ఇంతకుముందు జయప్రద హిట్ అండ్ టాప్ హీరోయిన్ గా ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ వంటి స్టార్ సీనియర్ హీరోస్ సరసన నటించింది.
ఇక అప్ప్పుడప్పుడు తెలుగు సినిమాల్లో కనబడే జయప్రద చాన్నాళ్లుగా తెలుగు తెరకు దూరంగానే ఉంది. జయప్రద ఇన్నాళ్ళకి మళ్ళీ మహేష్ బాబు తల్లిగా టాలీవుడ్ ప్రేక్షకుల ముందు సందడి చేయనుంది. ఇకపోతే ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తుండగా... దిల్ రాజు, అశ్విని దత్, పివిపి లు ఈ సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.