వరుసగా పెళ్లిచూపులు, అర్జున్‌రెడ్డి, గీతాగోవిందంతో సంచలనం సృష్టిస్తోన్న హీరో విజయ్‌దేవరకొండ ఓ చానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూకి కూడా లక్షల లైక్స్ లభిస్తున్నాయంటే ఈ హీరోకి ఉన్న క్రేజ్ ఈజీగా అర్ధమవుతోంది. తాజాగా ఆయన ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన గొంతును సవరించుకుని ‘ఇంకేం ఇంకేం కావాలే’ పాటను పాడాడు. ఇంటర్వ్యూ చేసిన జర్నలిస్ట్ మీ నోటి నుంచి ‘ఇంకేం ఇంకేం కావాలే’ అనే పాట వినాలని ఉందని అడిగిన వెంటనే విజయ్‌దేవరకొండ ఏమాత్రం సందేహించకుండా మ్యూజిక్ ప్లే చేస్తాను. పాడుతాను అని అన్నాడు. సిగ్గులేకపోవడం అంటే ఇదే అనుకుంటాను. ఇంత ట్రోల్ చేసినా ఇంకా పాడటం ఏమిటి అసలు? అనడంతో అక్కడ నవ్వులు విరబూశాయి. ఆ టీవీ వారు నా గొంతు వినాలనుకుంటున్నారు. మీరు కూడా పాడితే ఇద్దరం ట్రోల్ అవుతాం. పాడండబ్బా...అంటూ వినోదాన్ని పండించాడు.
ఆ తర్వాత ఫోన్‌లో పాట పెట్టుకుని రెండు సార్లు ‘ఇంకేం ఇంకేం కావాలే’ పాటను పాడి వినిపించాడు. సెట్‌లో కూడా నేను ఇలాగే పాడుతూ ఉంటాను. అందుకే దర్శకుడు నాచేత ఈ పాట పాడించాడు అని చెప్పుకొచ్చాడు. ఈ చిత్రంలో గోవింద్ అంత మంచోడు ఎవ్వడూ ఉండడు. గతంలో నన్ను ఇంటర్వ్యూ చేసిన దీప్తికి మీరే చెప్పాలి. మంచితనం మంచితనం అంటూ చావగొట్టింది నన్ను. విజయ్‌దేవరకొండ మీకోసం ఓ మంచి సినిమా చేశాడు. తప్పకుండా చూడండి.... అంటూ గతంలో జరిగిన సంఘటనలను చెప్పి నవ్వులు పూయించాడు. ఇంటర్వ్యూ పూర్తి అయిన తర్వాత కూడా ఎలాంటి వివాదాలు లేకుండా ఇంటర్వ్యూ ముగిసింది అని చెప్పి తనలోని స్పాంటేనియస్‌ని రుచి చూపించాడు ఈ యంగ్ హీరో. ఎంతైనా ఈ యంగ్ హీరో యాటిట్యూడే డిఫరెంట్ అని ఒప్పుకోవాలి.