Advertisementt

ఆ నటి నిశ్చితార్ధానికి ఈ నటి ఎందుకు రాలేదు?

Wed 22nd Aug 2018 08:52 AM
priyanka chopra,ranveer singh,leaves out,deepika padukune,guest list  ఆ నటి నిశ్చితార్ధానికి ఈ నటి ఎందుకు రాలేదు?
Did Priyanka Chopra miss out Ranveer Singh’s alleged GF Deepika ఆ నటి నిశ్చితార్ధానికి ఈ నటి ఎందుకు రాలేదు?
Advertisement
Ads by CJ

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌, ఈ మద్యకాలంలో హాలీవుడ్‌ చిత్రాలలో కూడా నటిస్తున్న నటి ప్రియాంకా చోప్రా. మరోవైపు ప్రియాంకాచోప్రాకు బాలీవుడ్‌తో సహా హాలీవుడ్‌లో కూడా గట్టి పోటీని ఇస్తున్న సుందరి దీపికాపదుకొనె. ఇక విషయానికి వస్తే తాజాగా ప్రియాంకాచోప్రా అమెరికన్‌ సింగర్‌ నిక్‌ జోనాస్‌ల ఎంగేజ్‌మెంట్‌ భారీగా జరిగింది. ఈ నిశ్చితార్ధ వేడుకలకు ముఖేష్‌ అంబాని, నీతా అంబాని, ఈషా అంబాని, సంజయ్‌లీలా భన్సాలీ, విశాల్‌ భరద్వాజ్‌, ఆయుష్‌ శర్మ, అలియాభట్‌, అర్పితా ఖాన్‌, పరిణితీ చోప్రా తదితరులు హాజరై కాబోయే దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. 

కానీ ఈ వేడుకకు దీపికాపదుకొనె హాజరుకాకపోవడం ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌ అయింది. ప్రియాంకా ఎంగేజ్‌మెంట్‌ని దీపికా తప్పకుండా హాజరవుతుందని అందరు భావించారు. కానీ ఆమె రాకపోవడానికి కారణం ఏమిటి? అన్న దానిపై చర్చ సాగుతోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ప్రియాంకా చోప్రా తన నిశ్చితార్ధానికి దీపికాను ఆహ్వానించలేదని తెలుస్తోంది. అందుకే దీపికా ఈ వేడుకు హాజరుకాలేదని అంటున్నారు. ఇక్కడ ట్విస్ట్‌ ఏమిటంటే... దీపికా లవర్‌ రణవీర్‌సింగ్‌ని మాత్రం ప్రియాంకా చోప్రా తన వేడుకకు హాజరుకావాల్సిందిగా కోరిందని తెలుస్తోంది. అయితే దీపికాను కాదని ఆమె లవర్‌ రణవీర్‌సింగ్‌ని మాత్రం ఎందుకు ఆహ్వానించింది? అనే దాని మీద పలు రకాల వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. 

Did Priyanka Chopra miss out Ranveer Singh’s alleged GF Deepika:

Priyanka Chopra invites Ranveer Singh and leaves out Deepika’s Name from Her Guest List?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ