Advertisementt

మరో వివాదంలోకి ఈ హీరోయిన్..!

Tue 21st Aug 2018 10:54 AM
kangana ranaut,real estate,brokerage controversy,manikarnika,bollywood heroine  మరో వివాదంలోకి ఈ హీరోయిన్..!
Actress Dragged Into Unwanted Controversy మరో వివాదంలోకి ఈ హీరోయిన్..!
Advertisement
Ads by CJ

బాలీవుడ్‌లో నేడున్న స్టార్‌ హీరోయిన్లలో తన మాటల ద్వారా వివాదాల వ్యక్తిగా ముద్రపడిన నటి కంగనా రౌనత్‌. ‘క్వీన్‌’ చిత్రంతో ఈమె దశే మారిపోయింది. ఇదే క్రమంలో ఆమె తాను ఒకానొక సమయంలో పోర్న్‌స్టార్‌ని కావాలనుకున్నానని, వారసుల పిల్లలకు తప్ప ఇతరులను సినిమా ఫీల్డ్‌లో పైకి ఎదగనివ్వరని చెప్పింది. ఇక కాస్టింగ్‌ కౌచ్‌ విషయంలో పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టించింది. ఇక తన మాజీ ప్రియుడు హృతిక్‌రోషన్‌తో విడిపోయిన తర్వాత ప్రతి చిత్రం విడుదలకు ముందు దానిని హైలైట్‌ చేస్తూ, ఉచిత ప్రచారం పొందాలని ప్రయత్నిస్తుంది. హృతిక్‌రోషన్‌, కంగనారౌనత్‌ల విషయంలో బాలీవుడ్‌ ప్రముఖులందరు హృతిక్‌కే మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. 

ఇక ఈమె తాజాగా మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఇటీవల ఆమె ముంబైలోని పాలీహిల్‌లో గత ఏడాది ఆమె రూ.20.07కోట్లతో ఓ ఇంటిని కొనుగోలు చేసింది. కానీ ఈ ఇంటిని కొనేందుకు మీడియేషన్‌ చేసిన బ్రోకర్‌కి మాత్రం కమిషన్‌ డబ్బులు ఎగగొట్టడంతో ఆ మీడియేషన్‌ చేసిన వ్యక్తి ముంబైలోని ఖర్‌ పోలీస్‌ స్టేషన్‌లో కంగనా రౌనత్‌, ఆమె సోదరి రంగేళిలపై మీడియేటర్‌గా వ్యవహరించిన ప్రకాష్‌జీ రోహిరా ఈ కేసును నమోదు చేశాడు. కానీ దీనిపై కంగనా స్పందిస్తూ.. ఈ బ్రోకర్‌కి ముందుగా అనుకున్న ప్రకారం ఇంటి మొత్తం కొనుగోలు డబ్బులో కమిషన్‌గా 1శాతం కమిషన్‌ని అంటే రూ.20లక్షలు చెల్లించామని, మొదట 1శాతం కమిషన్‌ అడిగిన ఆ మీడియేటర్‌ ప్రస్తుతం రెండు శాతం డిమాండ్‌ చేస్తున్నాడని మండిపడింది. నగదు చెల్లించిన పత్రాలు కూడా తమ వద్ద ఉన్నాయని ఆమె తెలిపింది. ప్రస్తుతం ఈమె తెలుగు దర్శకుడు క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతున్న వీరనారి ఝాన్సీలక్ష్మీభాయ్‌ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న చారిత్రక చిత్రం ‘మణికర్ణిక’ చిత్రంలో నటిస్తోంది. మరో తెలుగు స్టార్‌ రైటర్‌, రాజమౌళి తండ్రి, బాహుబలి, భజరంగీ భాయిజాన్‌ చిత్రాలకు కథను అందించిన విజయేంద్రప్రసాద్‌ ఈ చిత్ర కథను అందించడం విశేషం. 

Actress Dragged Into Unwanted Controversy:

>Kangana on real estate brokerage controversy

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ