జగపతిబాబు.. మాస్, యాక్షన్ చిత్రాలతో పాటు శోభన్‌బాబు తర్వాత ఫ్యామిలీ హీరోగా మహిళా ప్రేక్షకులు నచ్చిన, మెచ్చిన హీరో. అయితే ఈయన కెరీర్ ఎప్పుడు మూడు హిట్స్.. ఆరు ఫ్లాప్‌లగానే సాగింది. దాంతో ఆయన తమ సొంత బేనర్‌లో హీరోగా నటించిన చిత్రాలన్నీ తీవ్ర పరాజయం పాలైనాయి. దాంతో నిర్మాతగా, ఆర్దికంగా ఈయన బాగా దెబ్బతిన్నాడు. అయినా ఆయనను దగ్గరగా పరిశీలించిన వారికి ఆయన మంచితనం, మృదుస్వభావం, దానగుణం, ముక్కుసూటితనం వంటివి బాగా అర్ధమవుతాయి. ఇక ఈయన అడిగిన వారికి ఆపదల్లో ఎన్నో సాయాలు చేశాడు. దీని వల్ల కూడా ఆర్ధికంగా దెబ్బతిన్నాడు. ఈ విషయాన్ని ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.
ఇక ఈయన తాజాగా మాట్లాడుతూ, నాకు హీరోగా కంటే ఇప్పుడు విలన్‌గా, క్యారెక్టర్, సపోర్టింగ్ నటునిగానే హాయిగా ఉంది. హీరోగా నటిస్తే ఆ చిత్రం బరువు బాధ్యతలన్నీ మనమే మోయాలి. కానీ ఇప్పుడు అలా కాదు. నేను ఏ పాత్ర చేసినా నా తోటి నటీనటులు, దర్శకనిర్మాతలు నన్ను ఇంకా హీరోగానే చూస్తూ, అలానే ట్రీట్ చేస్తూ ఉండటం ఎంతో సంతోషంగా ఉంది. నిజాయితీతో కూడిన ఆత్మీయతను చూపే వారంటే నాకెంతో ఇష్టం. వారితో నేను బాగా కనెక్ట్ అవుతాను. అలాంటి వారిలో ప్రభాస్, ఎన్టీఆర్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ప్రభాస్‌కి ఫోన్ చేస్తే ఎంతో ఆప్యాయతగా మాట్లాడుతాడు. అందుబాటులో లేకపోతే ఆ తర్వాత తప్పకుండా ఫోన్ చేసి క్షేమ సమాచారాలను అడుగుతాడు. ఇక ఎన్టీఆర్ కూడా అంతే అభిమానం కలిగి ఉంటాడు. వాళ్లను నేన డిస్టర్బ్ చేయను. కబురు చేస్తే ఇంటికి వెళ్లి కలుసుకుని మాట్లాడి వస్తాను అంతే.. అని చెప్పుకొచ్చాడు జగ్గూభాయ్.