రాంగోపాల్‌వర్మ స్టైలే వేరు. ఆయన తీసిన ‘కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం- అప్పల్రాజు’ చిత్రంలో ఓ పాటలో ప్రతి దర్శకుడిపై ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇది కొందరు ఏదో తమాషాగా తీసుకుంటే కొందరు మాత్రం బాగా ఫీలయ్యారు. ఇక ఈయన ఎప్పుడు, ఎవరిని, ఏ దర్శకుడిని పెద్దగా ప్రశంసించడు. తనకి ఎంతో నచ్చిన పూరీజగన్నాథ్‌తో పాటు ఇటీవల ‘అర్జున్‌రెడ్డి’ చిత్ర దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా, తాజాగా తన శిష్యుడు అజయ్‌భూపతి తీసిన ‘ఆర్‌ఎక్స్100’ చిత్ర దర్శకులను ఓ రేంజ్‌లో పొగిడాడు.
ఇక తాజాగా వర్మ మాట్లాడతూ..ఎంతో నైపుణ్యం కలిగిన నూతన దర్శకుడు సిద్దార్ద్‌ని దర్శకునిగా పరిచయం చేస్తూ తీస్తున్న చిత్రానికి నేను నిర్మాతగా ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నాను. దీనిని నేను గర్వంగా ఫీలవుతున్నానని తెలిపాడు. ఈయన సిద్దార్ద్ దర్శకత్వంలో ‘భైరవగీత’ అనే చిత్రాన్ని తీస్తున్నట్లు తాజాగా తెలిపిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కన్నడ హీరో ధనుంజయ్ నటిస్తున్నాడు. ఆయన ఇటీవలే ఫిల్మ్‌ఫేర్ అవార్డును కూడా పొందాడు. ఇక ఇందులో ఐరా అనే యువతి హీరోయిన్‌గా నటిస్తోంది అని ప్రకటిస్తూ, ఆమె ఫొటోతో పాటు చిత్రంలోని మరో రెండు స్టిల్స్‌ని విడుదల చేశాడు వర్మ.
‘భైరవగీత’ చిత్రంలోని సన్నివేశం ఇది. గత పదేళ్లలో నేను చూసిన అత్యంత ప్రతిభాశాలి, ప్రామిసింగ్ డైరెక్టర్ సిద్దార్ద్ మాత్రమే. ఆయనను పరిచయం చేస్తున్నందుకు గర్వంగా ఉందని తెలిపాడు. ఇక ఇందులో ధనుంజయ ‘భైరవ’గా నటిస్తుండగా, ఇది ఓ ప్రేమకథా చిత్రమని, రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఓ యువకుడు రెబెల్‌గా ఎందుకు? ఎలా? మారాడు అనేదే ఈ చిత్రం కథ అని వర్మ తెలిపాడు. ఇక ఈ చిత్రానికి వర్మతో పాటు బాలాజీ అనే వ్యక్తి కూడా నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తూ ఉండటం విశేషం.