విజయ్‌దేవరకొండ... నేటి జనరేషన్‌కి ఐకాన్‌గా మారిన నటుడు. ‘పెళ్లిచూపులు, అర్జున్‌రెడ్డి’లతో ఈయన ఇమేజ్ అమాంతం పెరిగి ఓవర్‌నైట్ స్టార్‌డమ్ వచ్చింది. అయితే అవి ఏవో గాలివాటంగా వచ్చినవి కాదని తాజాగా విడుదలైన ‘గీతాగోవిందం’ చిత్రం కలెక్షన్లు నిరూపిస్తున్నాయి. ఈ చిత్రం మూడు రోజులకు వసూలు చేసిన కలెక్షన్లను నిర్మాతలు ఏరియాల వారిగా ప్రకటించారు. ఈ చిత్రం మూడు రోజుల్లో 37.45కోట్లు (గ్రాస్) సాధించిందని పోస్టర్‌ని విడుదల చేశారు. ఇక విషయానికి వస్తే స్టార్ హీరోల చిత్రాలు విడుదలైనప్పుడు తమ అభిమాన స్టార్ చిత్రం ఇంత వసూలు చేసింది.. అని చెబుతూనే మిగిలిన స్టార్స్ చిత్రాల కలెక్షన్లతో పోలుస్తూ తమ హీరో గొప్ప అంటే కాదు.. కాదు..మా హీరోనే ఎక్కువ వసూలు చేశాడని సోషల్‌మీడియాలో రచ్చ జరగడం మామూలైపోయింది. హీరోలు అలా పోల్చవద్దని, మరో హీరోలను అవమాన పరచవద్దని చెప్పినా అభిమానులు వినరు.
ఇక ‘గీతా గోవిందం’ విషయానికి వస్తే ట్రాకింగ్‌లేని మన రెండు రాష్ట్రాల కలెక్షన్లను పక్కనపెట్టి ఈ చిత్రం ట్రాకింగ్ ఉండే ఓవర్‌సీస్‌లో ఎంత వసూలు చేసిందో చెబుతూ, విజయ్ దేవరకొండ అభిమానులు, ఇతర హీరోల అభిమానులు మెగాహీరోలను టార్గెట్ చేస్తున్నారు. నిన్నగాక మొన్న వచ్చిన విజయ్‌దేవరకొండ నటించిన ఐదు చిత్రాలలో నాలుగు చిత్రాలు మిలియన్ మార్క్‌ని యూఎస్‌లో దాటాయి. ఒక్క ‘ద్వారక’ చిత్రం మాత్రమే విఫలమైంది. దీంతో ఎంతో బ్యాగ్రౌండ్, మెగాహీరోల అండ, మెగాభిమానుల ప్రోత్సాహం ఉన్నప్పటికీ మెగాకాంపౌండ్ హీరోలు సాధించలేని ఫీటుని విజయ్ సాధించాడంటూ మెగాహీరోలను ఇతర అభిమానులు ట్రోలింగ్ చేస్తున్నారు. ఇలా విజయ్‌ని ఇతర స్టార్స్‌తో పోల్చుతుండటం చూస్తూ ఉంటే విజయ్ దేవరకొండ కూడా స్టార్ హీరోల లిస్ట్‌లోకి చేరిపోయాడనే చెప్పాలి.