Advertisementt

మెగాభిమానులకు మరో గుడ్ న్యూస్!

Mon 20th Aug 2018 12:49 PM
ram charan,mega fans,good news,ram charan and boyapati film,first look,chiranjeevi  మెగాభిమానులకు మరో గుడ్ న్యూస్!
RC 12 Movie Frist Look on Chiru Birthday మెగాభిమానులకు మరో గుడ్ న్యూస్!
Advertisement
Ads by CJ

మెగాస్టార్‌ చిరంజీవి జన్మదిన వేడుకలంటే అభిమానులందరికీ సొంత పండుగ వంటిది. అందునా ఈ సారి చిరు బర్త్‌డేకి ఒకరోజు ముందుగానే చిరంజీవి నటిస్తున్న 151వ ప్రతిష్టాత్మక చిత్రం ‘సై..రా..నరసింహారెడ్డి’ టీజర్‌ని విడుదల చేయనున్నారు. దీనికోసం ఈ చిత్రం నిర్మాత రామ్‌చరణ్‌ సిద్దమవుతున్నాడు. ఇక చిరంజీవి బర్త్‌డేకి ముందురోజు ‘సై...రా’ ఫస్ట్‌ టీజర్‌ రానుండగా, బర్త్‌డే రోజున రామ్‌చరణ్‌, బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం తాలూకు ఫస్ట్‌లుక్‌ని విడుదల చేయడానికి రంగం సిద్దమవుతోంది. ఈ విషయాన్ని ఈ చిత్ర నిర్మాణ సంస్థ డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ అఫీషియల్‌గా పోస్టర్‌ ద్వారా తెలిపింది. చిరు బర్త్‌డే రోజున సాయంత్రం 5గంటలకు ఈ ఫస్ట్‌లుక్‌ విడుదల కానుంది. దీంతో పాటు మిగిలిన మెగా ఫ్యామిలీ హీరోల కొత్త చిత్రాలకు సంబంధించిన పలు విశేషాలు చిరు బర్త్‌డే కానుకగానే విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. 

అంటే చిరు పుట్టినరోజుకి ఒకరోజు ముందు ఉదయం 11 గంటల నుంచి దాదాపు రెండు రోజులు మెగాభిమానుల హడావుడి సాగనుంది. ఇక బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న పవర్‌ఫుల్‌ చిత్రంలో రామ్‌చరణ్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రను చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. మరి ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌తో పాటు టైటిల్‌ని కూడా అనౌన్స్‌ చేస్తారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. ఇక బోయపాటి, రామ్‌చరణ్‌ చిత్రం సంక్రాంతి బరిలోకి దిగుతుండగా, చిరంజీవి ‘సై..రా..నరసింహారెడ్డి’ చిత్రం వచ్చే ఏడాది వేసవి కానుకగా విడుదల కానుందని సమాచారం. ఇలా చిరు బర్త్‌డే సందర్భంగా ఆయన కుమారుడు రామ్‌చరణ్‌ చిత్రం ప్రమోషన్స్‌ని మొదలుపెట్టనుండగా, ‘రంగస్థలం’ వంటి భారీ హిట్‌ తర్వాత బోయపాటితో రామ్‌చరణ్‌ చేస్తోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. 

RC 12 Movie Frist Look on Chiru Birthday:

One More Good News To Mega Fans

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ