టాలీవుడ్ లో బుల్లితెర మీద నాని వ్యాఖ్యాతగా బిగ్ బాస్ సీజన్ 2 ఒక రేంజ్ లో సాగుతుంది. బిగ్ బాస్ హౌస్ లో అనేక నాటకీయ పరిణామాలతో పాటుగా.. ప్రతి వారం తమ సినిమాని ప్రమోట్ చేసుకునేందుకు.. కొత్త సినిమాల దర్శకనిర్మాతలతో పాటుగా... ఆ సినిమాలో నటించిన హీరో హీరోయిన్స్ బిగ్ బాస్ లోకి వచ్చి ప్రేక్షకులను దగ్గరవుతూ తమ సినిమాలను ప్రమోట్ చేసుకుంటున్నారు. అందరిలో కమల్ హాసన్ తన విశ్వరూపం 2 సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి తెలుగు బిగ్ బాస్ హ్యూస్ లోకి అడుగుపెట్టి సందడి చేసాడు. అలాగే ఇంకా చాలామంది తమ టీమ్ తో తమ సినిమాలను ప్రమోట్ చేయుకుంటుంటే... విజయ్ దేవరకొండ మాత్రం తన సినిమా విడుదలై సూపర్ హిట్ అయ్యాక బిగ్ బాస్ స్టేజ్ మీద అడుగు పెట్టాడు.
బిగ్ బాస్ షో లో శని, ఆదివారంలో నాని ఈ షోని సక్సెస్ ఫుల్ గా నడిపించడంతో పాటుగా ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేస్తున్నాడు. అయితే ఈ రోజు ఆదివారం దర్శకుడు పరశురామ్ తో పాటుగా.. గీత గోవిందం హీరో విజయ్ దేవరకొండ కూడా నాని తోపాటుగా బిగ్ బాస్ హౌస్ మేట్స్ తో ఫన్ గేమ్ ఆడాడు. బిగ్ బాస్ షో స్టేజ్ మీది సోఫాలో స్టైలిష్ గా కూర్చున్న విజయ్ దేవరకొండ బిగ్ బాస్ హౌస్ లోని కంటెస్టెంట్ దీప్తి సునయనకి సీక్రెట్ టాస్క్ ఇచ్చి బిగ్ బాస్ హౌస్ మేట్స్ తో గేమ్ ఆడాడు. దీప్తి సునయన అక్క పెళ్లి జరగడంతో సాడ్ మూడ్ పెట్టమంటే రోల్ రైడ వచ్చి దీప్తి సునయనని హగ్ చేసుకుంటే.. నిన్ను షోలో అందరూ అలాగే హగ్ చేసుకుంటున్నారా... అయితే లడ్డు గేమ్ ఆడుదామని... దీప్తి సునయన్తో విజయ్ దేవరకొండ ఫన్ తో కూడిన లడ్డు గేమ్ ఆడాడు.
తాను తనీష్ కి పెట్టబోతూ.. సునయనే ఆ లడ్డు తినెయ్యడం.. రోల్ మొహం మీద లడ్డు కొట్టడం, సామ్రాట్ మీదకి లడ్డు విసరమని నాని చెప్పగానే సునయన విసిరెయ్యడం.. ఆ లడ్డుని సామ్రాట్ క్యాచ్ పట్టడంతో... ఆతర్వాత నిద్ర పోతున్న అమిత్ మీద సునయనని వాటర్ పోసి ఆ బోటిల్ ని గణేష్ చేతిలో పెట్టమనగానే.. సునయన అలానే చేసి గణేష్ కి బాటిల్ ఇవ్వగా... ఆ బాటిల్ ని గణేష్ వెంటనే చాకచక్యంగా సోఫాలో పెట్టేయడం.. అమిత్ లేవగానే సునయన తెలివిగా గణేష్... అమిత్ భయ్యా మీద నీళ్లేందుకు పోసావ్ అనగానే అమిత్ కోపంగా మైక్ విసిరెయ్యడం... దానికి విజయ్ దేవరకొండ కూడా కాస్త షాక్ అవడం.. వంటి విషయాలతో బిగ్ బాస్ స్టేజ్ మీద ఫుల్ గా విజయ్ ఫన్ క్రియేట్ చేశాడు.