త్రివిక్రమ్ - ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కుతున్న అరవింద సమేత - వీర రాఘవ సినిమా దసరాకి విడుదల చెయ్యాలనే టార్గెట్‌తో షూటింగ్‌ని జెట్ స్పీడుతో పూర్తి చేస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న త్రివిక్రమ్ - ఎన్టీఆర్ సినిమా మీద ఆకాశాన్ని తాకే అంచనాలు ఉన్నాయి. ఎన్టీఆర్ జనతా గ్యారేజ్, జై లవ కుశ హిట్స్ తో అదరగొట్టే ఫామ్ లో ఉంటే.. త్రివిక్రమ్ కి అజ్ఞాతవాసి అట్టర్ ప్లాప్ ఉన్నప్పటికీ... ఈ అరవింద మీద భారీ క్రేజ్ ట్రేడ్ లోను ప్రేక్షకుల్లోనూ ఉంది. పూజ హెగ్డే అరవింద రోల్ ని ప్లే చేస్తున్న ఈ సినిమా రాయలసీమ బ్యాగ్డ్రాప్ లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
అయితే ఈ సినిమాని త్రివిక్రమ్ తన జోనర్ అంటే కామెడీ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కించకుండా మాస్ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కిస్తున్నాడనే ఫీలింగ్ లో ఎన్టీఆర్ ఫాన్స్ తో పాటుగా మిగతా ప్రేక్షకులు ఉన్నారు. ఎందుకంటే అరవింద సమేత ఫస్ట్ లుక్ లో ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ లుక్ లో మాస్ గా కనబడడం ఒక ఎత్తైతే.. నిన్నగాక మొన్న వదిలిన అరవింద సమేత టీజర్ కూడా పక్కా మాస్ ని తలపించింది. ఎన్టీఆర్ పదునైన ఆయుధంతో... రౌడీలను చితక్కొడుతూ.. పవర్ ఫుల్ మాస్ డైలాగ్ తో అరవింద సమేత టీజర్ ని కట్ చేశారు. ఇక త్రివిక్రమ్ ఎందుకిలా ఎన్టీఆర్ రూట్ లోకి వెళ్లిపోయాడంటూ.. ఫిలింనగర్ లో హాట్ హాట్ చర్చలు లేవదీశారు.
అయితే ఫస్ట్ లుక్ విషయంలో ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ లుక్ తోపాటుగా... ఎన్టీఆర్ అండ్ పూజ హెగ్డే ల క్యూట్ అండ్ కూల్ లుక్‌ని వదిలారు. అలాగే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి క్లాస్ టీజర్‌ని కూడా వదలబోతున్నారట. ముందు మాస్ టీజర్ ని వదిలిన తర్వాత కొద్దీ రోజుల గ్యాప్ లో అరవింద సమేత రొమాంటిక్ అండ్ ఫన్ టీజర్ ని వదలబోతున్నట్టుగా సోషల్ మీడియా టాక్. అరవింద సమేత మొదటి టీజర్ లో మాస్ ఎలిమెంట్స్ ఉంటే.. తాజాగా వదలబోయే టీజర్ లో త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ ఉంటాయంటున్నారు. మరి మాస్ టీజర్ అయినా అరవింద సమేత టీజర్ యూట్యూబ్ రికార్డులను క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు వదలబోయే ఫన్ టీజర్ కూడా ఏ మేర రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.