Advertisementt

‘అదుగో’ దసరా సెలవులకి వచ్చేస్తున్నాం

Sun 19th Aug 2018 04:57 PM
adhugo,dussehra holidays,ravibabu,adhugo movie release  ‘అదుగో’ దసరా సెలవులకి వచ్చేస్తున్నాం
Adhugo for Dussehra Holidays ‘అదుగో’ దసరా సెలవులకి వచ్చేస్తున్నాం
Advertisement
Ads by CJ

ద‌స‌రా సెల‌వుల‌కు అదుగో.. 

ర‌విబాబు న‌టిస్తూ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిస్తున్న సినిమా అదుగో. ఈ సినిమా అన్ని భార‌తీయ భాష‌ల్లో విడుద‌ల అవుతుండ‌టం విశేషం. అంద‌రికీ క‌నెక్ట్ అయ్యే యూనిక్ కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు ద‌ర్శ‌కుడు ర‌విబాబు. ఇందులో ఓ పందిపిల్ల కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తుండ‌టం విశేషం. ఇండియ‌న్ సినిమా చ‌రిత్ర‌లోనే తొలి సారి పూర్తిస్థాయి లైవ్ యాక్ష‌న్ 3డి యానిమేష‌న్ ను చూపిస్తోన్న సినిమా ఇది. కుటుంబ ప్రేక్ష‌కుల‌ను.. పిల్ల‌ల‌ను బాగా ఆక‌ట్టుకునే కామెడీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా దీన్ని తెర‌కెక్కిస్తున్నారు ర‌విబాబు. అందుకే ఈ చిత్రాన్ని వీలైన‌న్ని భాష‌ల్లో విడుద‌ల చేయాల‌ని భావిస్తున్నారు నిర్మాత‌లు. తెలుగులో అదుగో అనే టైటిల్ తోనే రానున్న ఈ చిత్రం.. మిగిలిన భాష‌ల్లో మాత్రం బంటి పేరుతో విడుద‌ల కానుంది. 

అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని ద‌స‌రా సెల‌వుల్లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది అదుగో చిత్రం.

అదుగో సినిమాలో అభిషేక్ వ‌ర్మ‌, న‌భా ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తుండ‌గా.. ప్ర‌ముఖ నిర్మాత సురేష్ బాబు ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ నుంచి స‌మ‌ర్పిస్తున్నారు. ఏ ఫ్లైయింగ్ ఫ్రాగ్ బ్యాన‌ర్ లో ర‌విబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

Adhugo for Dussehra Holidays :

Ravibabu Adhugo movie Release on Dussehra Holidays 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ