Advertisementt

సల్మాన్‌ చిన్నప్పటి టీచర్ లవ్ స్టోరీ..!

Sun 19th Aug 2018 02:16 PM
salman khan,childhood love story,dus ka dum,teacher  సల్మాన్‌ చిన్నప్పటి టీచర్ లవ్ స్టోరీ..!
Salman Khan Childhood Love Story సల్మాన్‌ చిన్నప్పటి టీచర్ లవ్ స్టోరీ..!
Advertisement
Ads by CJ

చాలామంది బయటకు చెప్పరు గానీ అప్పుడప్పుడే యవ్వనంలోకి అడుగుపెట్టే టీనేజ్‌ వయసులో కుర్రాళ్లు తమ లేడీ టీచర్లు అందంగా ఉంటే పాఠాలు వినేబదులు వారిని సైట్‌ కొడుతూ ఉంటారు. ఈ విషయాన్ని చాలా మంది చెప్పుకోరు గానీ ప్రతి ఒక్కరి టీనేజ్‌లో ఇలాంటి అనుభవాలు ఉంటాయి. ఆమద్య మెగాస్టార్‌ చిరంజీవి, అమితాబ్‌బచ్చన్‌లు కూడా తాము చదువుకునే రోజుల్లో టీచర్లను బాగా ఇష్టపడే వారిమని చెప్పారు. ఇక బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌ విషయానికి వస్తే ఇండియాలోనే ఈయన్ను మించిన ప్లేబోయ్‌ ఉండడనే చెప్పాలి. ఈ వయసులో కూడా బ్రహ్మచారిగా ఉంటూ తనతో ఎవరు కలిసి నటించినా కూడా వారితో ఎఫైర్లు నడుపుతూ ఉంటారు. 

ఐశ్వర్యారాయ్‌, కత్రినా కైఫ్‌, జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌, జరీనాఖాన్‌.. ఇలా ఆయన ఎఫైర్లు నడిపిన వారి పేర్లు లిస్ట్‌ చాంతాడంత ఉంటుంది. ఇక తాజాగా ఆయన దస్‌కా దమ్‌ షోలో మాట్లాడుతూ.. స్కూల్‌లో చదివే రోజుల్లో నా ప్రేమాయణం గురించి చెప్పాలి. ఆరోజుల్లో నేను చదువుకునే స్కూల్‌ టీచర్‌ ప్రేమలో పడ్డాను. ఆమెని ఎంతో ఇష్టపడే వాడిని. ఆమె పాఠం చెబుతూ ఉంటే అలాగే చూస్తూ ఉండేవాడిని. టీచరమ్మని మెప్పించేందుకు సైకిల్‌పై ఆమెని ఇంటిదాకా దించి వచ్చేవాడిని. ఆమెను సైకిల్‌కి ముందు వైపు కూర్చొబెట్టుకునేందుకు గాను సపరేట్‌గా సైకిల్‌ వెనుక బ్యాగ్‌, లంచ్‌బాక్స్‌ పెట్టుకునే వాడిని... అని సల్మాన్‌ చెప్పగానే అక్కడంతా నవ్వులు విరబూశాయి. 

ఇంకా ఆయన మాట్లాడుతూ.. టీచర్‌కి సైట్‌ కొట్టని విద్యార్ది ఉండడు. చాలామంది దీనిని బయటకు చెప్పడానికి ఇష్టపడరు. నేను మాత్రం టీచర్‌కి సైట్‌ కొట్టేవాడిని.. అని ఒప్పుకున్నాడు. దాదాపు ఇలాంటి పాత జ్ఞాపకాలతో వచ్చిన *నా ఆటోగ్రాఫ్‌ స్వీట్‌మెమరీస్‌’ వంటివి ప్రేక్షకులకు అంతగా కనెక్ట్‌ కావడానికి జీవితంలో ప్రతి ఒక్కరికి అనుభవమైన ప్రేమ వ్యవహరాలను చూపించడమే కారణమని చెప్పవచ్చు. ఇక సల్మాన్‌ విషయానికి వస్తే ఆయన ‘భారత్‌’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. అలీ అబ్బాస్‌ దర్శకత్వంలో వహిస్తున్న ఈ చిత్రం వచ్చే రంజాన్‌ కానుకగా విడుదల కానుంది. ఇందులో సల్మాన్‌కి జోడీగా ఆయన మాజీ ప్రేయసి కత్రినాకైఫ్‌ నటిస్తూ ఉండటం విశేషం. 

Salman Khan Childhood Love Story:

Honest Confession: I used to flirt with my teacher, says Salman Khan

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ