Advertisementt

పేప‌ర్ బాయ్ మంచి ప్రేమ‌క‌థ: సంపత్ నంది

Sun 19th Aug 2018 12:50 PM
paper boy,sampath nandi,paper boy trailer launch,k raghavendra rao  పేప‌ర్ బాయ్ మంచి ప్రేమ‌క‌థ: సంపత్ నంది
Paper Boy Trailer Released పేప‌ర్ బాయ్ మంచి ప్రేమ‌క‌థ: సంపత్ నంది
Advertisement
Ads by CJ

పేప‌ర్ బాయ్ ట్రైల‌ర్ విడుద‌ల‌

పేప‌ర్ బాయ్ ట్రైల‌ర్ విడుద‌ల కార్య‌క్ర‌మం ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి చిత్ర‌యూనిట్ అంతా హాజరైంది. ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు ఈ చిత్ర ట్రైల‌ర్ చూసి అభినందించారు.

ఈ సందర్భంగా సంగీత ద‌ర్శ‌కుడు భీమ్స్ మాట్లాడుతూ.. ముందుగా నాకు జీవితం ఇచ్చిన సంప‌త్ నందికి కృత‌జ్ఞ‌త‌లు. ఈ సినిమాకు ఆత్మ ఆయ‌నే. ఇక మీడియా ప‌ర్స‌న్ సురేష్ ఉపాధ్యాయ్ ఈ చిత్రంలో మూడు పాట‌లు రాసాడు. చిన్న సినిమా ఇది.. అంతా ఆద‌రిస్తార‌ని న‌మ్ముతున్నాను అన్నారు. 

హీరోయిన్ రియా సుమ‌న్ మాట్లాడుతూ.. సంపత్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ సినిమాలో ధ‌ర‌ణి పాత్ర‌లో న‌టించాను. ఇది నాకు చాలా ప్ర‌త్యేకం. ఈ పాత్ర కోసం న‌న్ను న‌మ్మినందుకు ద‌ర్శ‌కుడు జ‌య‌శంక‌ర్ గారికి కూడా థ్యాంక్స్. డివోపి సౌంద‌ర్ రాజ‌న్ గారు అద్భుతమైన విజువ‌ల్స్ ఇచ్చారు. పేప‌ర్ బాయ్ అంద‌రికి ఫ‌స్ట్ ల‌వ్ ను గుర్తు చేసే మంచి ప్రేమ‌క‌థ‌. అంద‌రూ సెప్టెంబ‌ర్ 7న థియేట‌ర్ కు వ‌చ్చి ఎంజాయ్ చేస్తార‌ని ఆశిస్తున్నా.. అన్నారు. 

హీరో సంతోష్ శోభ‌న్ మాట్లాడుతూ.. సంప‌త్ గారితో ప‌ని చేయ‌డం నాకు ప్ర‌త్యేకం.. ఇది చాలా ప్ర‌త్యేక‌మైన అనుభ‌వం కూడా. ఈ అవ‌కాశం నాకు ఇచ్చినందుకు ధ‌న్యవాదాలు. రాములు, వెంక‌ట్, న‌ర‌సింహాకు మ‌న‌స్పూర్థిగా కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్నాను. సెప్టెంబ‌ర్ 7న విడుద‌ల కానున్న ఈ చిత్రాన్ని అంద‌రూ చూసి ఆశీర్వ‌దించి.. ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నానని చెప్పారు. 

ద‌ర్శ‌కుడు జ‌య‌శంక‌ర్ మాట్లాడుతూ.. నేను ఎప్పుడైతే క‌థ విన్నానో.. వెంట‌నే దాంతో క‌నెక్ట్ అయిపోయాను. ఈ విష‌యంలో న‌న్ను న‌మ్మినందుకు సంప‌త్ నంది గారికి థ్యాంక్ యూ అన్నారు. 

ద‌ర్శ‌కుడు సంప‌త్ నంది మాట్లాడుతూ.. ముందుగా ఈ ట్రైల‌ర్ లాంఛ్ కార్య‌క్ర‌మానికి వ‌చ్చినందుకు మీడియా వాళ్లంద‌రికీ థ్యాంక్ యూ. టీజ‌ర్ కు 36 ల‌క్ష‌ల వ్యూస్ వ‌చ్చాయి. ఇప్ప‌టికే విడుద‌లైన రెండు పాట‌లకు కూడా మంచి స్పంద‌న వ‌చ్చింది. మేం మంచి సినిమానే తీసాం అని గ‌ట్టిగా న‌మ్ముతున్నాం. పేప‌ర్ బాయ్ మంచి ప్రేమ‌క‌థ‌. ఈ సినిమాలో నాకు తోడుగా ఉన్న రాములు, వెంకట్, న‌ర‌సింహాకు థ్యాంక్స్. వాళ్లే ఈ సినిమాకు వెన్నుముక‌లా నిల‌బ‌డ్డారు. సెప్టెంబ‌ర్ ఈ చిత్రం 7న విడుద‌ల కానుంది. మా సినిమా త‌ప్ప‌కుండా ప్రేక్ష‌కులంద‌రికీ న‌చ్చుతుంద‌ని ఆశిస్తున్నాను.. అని అన్నారు. 

Paper Boy Trailer Released:

Sampath Nandi Film Paper Boy Trailer Launched

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ