Advertisementt

గుమ్మడి గొప్పతనం అప్పుడు తెలిసొచ్చిందట

Sun 19th Aug 2018 09:33 AM
paruchuri gopala krishna,gummadi,greatness  గుమ్మడి గొప్పతనం అప్పుడు తెలిసొచ్చిందట
Paruchuri Gopala Krishna About Gummadi గుమ్మడి గొప్పతనం అప్పుడు తెలిసొచ్చిందట
Advertisement

తెలుగులో ఎస్వీరంగారావు తర్వాత తండ్రి పాత్రలు, జమీందార్‌ వేషాలు, గంభీరమైన, రుణరసమైన పాత్రలు చేయడంలో గుమ్మడి వెంకటేశ్వరరావుది విభిన్నశైలి. ఆయన చిన్న వయసులోనే తన కంటే ఎంతో పెద్ద అయిన ఎన్టీఆర్‌, అక్కినేని వంటి వారికి తండ్రిగా కూడా నటించారు. ఎస్వీరంగారావుని సినిమాలలో పెట్టుకోకూదని ఎన్టీఆర్‌, ఏయన్నార్‌లు నిర్ణయించిన తర్వాత ఆయన స్థానం భర్తీ చేసేందుకు ఎన్టీఆర్‌, ఏయన్నార్‌లు గుమ్మడికి సపోర్ట్‌ని అందించారు. ఇక ఈయన కేవలం జమీందార్‌, తల్లి పాత్రలే కాదు.. పేదవాడిగా, విలన్‌గా కూడా నటించారు. 

ఇక విషయానికి వస్తే నటీనటులు ఇమేజ్‌, క్రేజ్‌, ఫాలోయింగ్‌, వారి బాడీ లాంగ్వేజ్‌, డైలాగ్‌ డెలివరికీ తగ్గట్లుగా తూటాల్లాంటి సంభాషణలు రాయడంలోనే కాదు.. కథ, మాటల రచయితలుగా అందరినీ మెప్పించిన దిగ్గజాలు పరుచూరి బ్రదర్స్‌. తాజాగా పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ, గుమ్మడి గారంటే జమీందార్‌, ధనవంతుల పాత్రలకు సరిపోయే వారు. ఆయనతో మేము పనిచేసిన మొదటి చిత్రం సురేష్‌ప్రొడక్షన్స్‌లో రామానాయుడు నిర్మాతగా కృష్ణ, శోభన్‌బాబు, శ్రీదేవి, జయసుధ వంటి వారు నటించిన ‘ముందడుగు’. ఇందులో కూడా గుమ్మడి ధనవంతునిగానే కనిపిస్తాడు. దానికి కాస్త అటు ఇటుగా వచ్చిన మరో చిత్రం ‘మరో మలుపు’. 

ఇందులో కీలకపాత్రధారి తిండికి కూడాలేని ఓ పూజారి. ఏరోజుకా రోజు గుడిప్రసాదం తింటూ జీవితాన్ని సాగించే పేద బ్రాహ్మణుని పాత్ర. ఈ చిత్ర దర్శకుడు ఆ పాత్రను గుమ్మడితో చేయిద్దామని అన్నారు. జమీందార్‌ పాత్రల్లో కనిపించే ఆయన్ను పేద బ్రాహ్మణునిగా ప్రేక్షకులు అంగీకరిస్తారా? అనే అనుమానం మాకు వచ్చింది. అయితే ఆ విషయంలో నా ఆలోచన తప్పని తర్వాత తెలిసింది. పేద బ్రాహ్మణుని పాత్రలో గుమ్మడి జీవించారు. అందుకే నటీనటులను తక్కువగా అంచనా వేయడానికి వీలులేదని మేము గ్రహించామని పరుచూరి గోపాలకృష్ణ తెలిపారు. ఇక గుమ్మడి చివరి చిత్రం ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ‘ఆయనకిద్దరు’ చిత్రం. ఇందులో గుమ్మడి పాత్రకు నూతన్‌ప్రసాద్‌ డబ్బింగ్‌ చెప్పాడు. 

Paruchuri Gopala Krishna About Gummadi:

Paruchuri Gopala Krishna Talks About Gummadi Greatness

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement