కొన్ని నెలలు కిందట వరకు నైజాం మెగాస్టార్ ఎవరు అంటే నితిన్ పేరు చెప్పేవారు అంత. ఎందుకంటే అప్పట్లో నితిన్ వరస విజయాలతో ఆ ఏరియాలో దూసుకుపోయాడు. అందుకే ఆయనకు ఆ పేరు వచ్చింది. అయితే ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయింది. ఎందుకంటే నితిన్ కు వరస డిజాస్టర్స్ రావడంతో.. ఇప్పుడు ఆ బిరుదు ఇక నితిన్‌కి సూటవ్వదు. ఎందుకంటే ఆ బిరుదు ఇంకో హీరోకి వచ్చింది.
వరస హిట్స్ తో తెలుగు రాష్ట్రాల్లో తన సత్తా చూపుతున్న హీరో విజయ్ దేవరకొండను నైజాం మెగాస్టార్‌గా చూస్తున్నారు అభిమానులు. నితిన్ కు వరస ప్లాప్స్.. విజయ్ కు వరస హిట్స్ ఉండటం అందుకు కారణం. విజయ్ 'పెళ్లి చూపులు'..'అర్జున్ రెడ్డి'..రీసెంట్ గా 'గీత గోవిందం' తో సూపర్ హిట్ చిత్రాలు అందించాడు.
అందుకే ఇప్పుడు అతన్ని అంతా నైజాం మెగాస్టార్ అని పిలుస్తున్నారు. మరి ఆ బిరుదును విజయ్ దేవరకొండ నిలబెట్టుకుంటాడో లేదో చూడాలి. ఇక 'గీత గోవిందం'తో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు విజయ్. మొదటి రోజు అందరి అంచనాలకు తగ్గట్టుగా వసూల్ వర్షం కురిపించాడు. వరసగా సెలవలు రావడం ఈ సినిమాకు ఇంకా ప్లస్ అయింది.