Advertisementt

వాళ్లు ఎందుకు నో చెప్పారో తెలియదు: రష్మిక

Fri 17th Aug 2018 11:03 PM
rashmika mandanna,geetha govindham,interview,updates  వాళ్లు ఎందుకు నో చెప్పారో తెలియదు: రష్మిక
Rashmika Mandanna About Geetha Govindham వాళ్లు ఎందుకు నో చెప్పారో తెలియదు: రష్మిక
Advertisement
Ads by CJ

రష్మిక మందన్న.. కన్నడలో వచ్చిన 'కిర్రాక్‌పార్టీ'తో దేశవ్యాప్తంగా అన్ని భాషా చిత్రాలు మేకర్స్‌ దృష్టిని తనవైపు మరల్చుకుంది. ఇటీవల ఆమె మాట్లాడుతూ, తనకి స్వీటీ అనుష్కలాగా మంచి పేరు తెచ్చుకోవాలని, ఆ తరహా పాత్రలను చేయాలని ఉందని తెలిపింది. అయితే మొదటి చిత్రం 'కిర్రాక్‌పార్టీ' సమయంలోనే ఈ కన్నడ భామ కన్నడ నటుడు, నిర్మాత రక్షిత్‌లు ప్రేమలో పడ్డారు. వీరి నిశ్చితార్ధం కూడా జరిగిపోయింది. దాంతో ఆమె త్వరలో వివాహం చేసుకోనుంది. అలాంటి సమయంలో ఈ షార్ట్‌ గ్యాప్‌లో ఆమె స్వీటీ అనుష్క వంటి ఇమేజ్‌ తెచ్చుకోవడం సాధ్యంకాదు. తెలుగులో ఈమె నాగశౌర్య హీరోగా నటించిన 'ఛలో' చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం మంచి విజయం సాధించింది. 

ఇక రెండో చిత్రంగా ఏకంగా గీతాఆర్ట్స్‌2 బేనర్‌లో విజయ్‌దేవరకొండ హీరోగా పరశురాం దర్శకత్వంలో రూపొందిన 'గీతగోవిందం'లో నటించింది. ఈ చిత్రం 'ఛలో' కంటే భారీ విజయం దిశగా సాగుతోంది. వీటితో పాటు ఆమె నాగార్జున, నానిలు నటిస్తున్న మల్టీస్టారర్‌ చిత్రంలో నానికి జోడీగా నటిస్తోంది. దీనికి ఆల్‌రెడీ 'దేవదాస్‌' అనే టైటిల్‌ని నిర్ణయించారు. అశ్వనీదత్‌ నిర్మిస్తున్నఈ చిత్రానికి శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నాడు. మరోవైపు ఆమె మరోసారి విజయ్‌ దేవరకొండతో కలిసి 'డియర్‌ కామ్రేడ్‌'లో నటిస్తోంది. వరుసగా మూడు చిత్రాల విజయంతో ఈమె సక్సెస్‌ఫుల్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. మరోవైపు ఆమెకి రక్షిత్‌కి జరిగిన నిశ్చితార్దం క్యాన్సిల్‌ అయిందని, తనకు నటిగా వస్తున్న ఆఫర్లను చూసి ఆమె వివాహం రద్దు చేసుకుందని వార్తలు వస్తున్నాయి. 

తాజాగా ఈ విషయంపై రష్మిక మందన్న స్పందించింది. నాకు, రక్షిత్‌కి నిశ్చితార్దం జరిగిన సమయంలోనే రెండున్నరేళ్ల తర్వాత మాత్రమే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. ఈ తరహా వార్తలు వింటుంటే నాకు నవ్వొస్తోంది. అయితే సినిమాలలో బిజీగా ఉండటం వల్ల ఎప్పుడు, ఏ తేదీన వివాహం చేసుకోవాలి అనేది మాత్రం నిర్ణయించుకోలేదు. 'గీతగోవిందం' చిత్రం కోసం ఏడున్నర నెలలు పనిచేశాను. ఏడు నెలల పాటు కోపంతో నటించిన నేను చివరి 15రోజులు మాత్రం సరదాగా గడిపాను. ఇక పలువురు ఈ చిత్రంలో నటించేందుకు నో చెప్పారనే విషయం నాకు తెలియదు. వారి కారణాలు ఏమిటి? వాళ్లు ఎందుకు వద్దన్నారో తెలియదు... అని క్లారిటీ ఇచ్చింది. 

Rashmika Mandanna About Geetha Govindham:

Rashmika Mandanna Geetha Govindham interview

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ