Advertisementt

‘ఫ్రైడే’ రోజున ‘ఫ్రైడే’ ప్రారంభించారు

Fri 17th Aug 2018 08:38 PM
friday,friday movie launch,friday movie opening,harish rao  ‘ఫ్రైడే’ రోజున ‘ఫ్రైడే’ ప్రారంభించారు
Friday Movie Launched ‘ఫ్రైడే’ రోజున ‘ఫ్రైడే’ ప్రారంభించారు
Advertisement
Ads by CJ

మంత్రి హరీష్‌రావు చేతుల మీదుగా ‘ఫ్రైడే’ చిత్రం ప్రారంభం

శ్రీ మీనాక్షి మూవీస్ పతాకంపై  కె ఎస్ ఆర్ డాన్స్ అకాడమీ సమర్పణలో నిర్మాత కె. సత్య రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘ఫ్రైడే’. కిషన్ కె. కె. హీరోగా పరిచయం అవుతున్న ఈ చిత్రం శుక్రవారం నాడు అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఘనంగా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని జరుపుకుంది. ఈ  నూతన చిత్రానికి క్లాప్‌ని మంత్రి హరీష్‌రావు ఇవ్వగా, గౌరవ దర్శకత్వం సి. కళ్యాణ్ వహించగా.. నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ  కెమెరా స్విచ్ఛాన్ చేశారు. షాద్‌నగర్ నియోజకవర్గ ఎమ్‌ఎల్‌ఏ అంజయ్య ముఖ్య అతిథిగా విచ్చేసి పూజా కార్యక్రమాలను నిర్వహించారు.

అనంతరం ఈ చిత్ర దర్శకుడు దాసరి లారెన్స్ మాట్లాడుతూ.. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ స్టోరీతో చిత్రం ఉంటుంది. హీరో పోలీసు ఆఫీసర్ పాత్రలో నటించనున్నారు.  మంచి కథతో ముందుకు వస్తున్నాము. ఆదరిస్తారని ఆశిస్తున్నా.. అన్నారు. 

హీరో కిషన్ మాట్లాడుతూ.. డైరెక్టర్ దాసరి లారెన్స్ గారు ఎంతో కష్టపడి సినిమాను ప్లాన్ చేశారు.. ఈ చిత్రానికి ప్రొడ్యూసర్ సత్య రెడ్డి గారే స్క్రిప్ట్ అందించారు. దాదాపు సంవత్సరం పాటు స్క్రిప్ట్ పై కష్టపడి పనిచేశారు. ఇందులో ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారు. బేబీ మీనాక్షి ఇందులో లీడ్ రోల్ ప్లే చేస్తోంది.  క్రైమ్ పోలీసు ఆఫీసర్ పాత్రలో నూతనంగా హీరోగా పరిచయం అవుతున్నా.. ఆదరిస్తారని ఆశిస్తున్నా.. అన్నారు. 

నిర్మాత సత్య రెడ్డి మాట్లాడుతూ.. మా నూతన చిత్ర ప్రారంభోత్సవానికి విచ్చేసిన అతిథులు అందరికీ ధన్యవాదాలు తెలువుతున్నాము. చిత్ర విషయానికి వస్తే..    డిఫరెంట్ కాన్సెప్ట్. నవరసాలు ఉన్న స్టోరీ. చెప్పాలంటే ఉగాది పచ్చడి లాంటి చిత్రమే ఫ్రైడే. మొట్టమొదటి సారి ప్రొడక్షన్ స్టార్ట్ చేశాము. అంతా సాజావుగా సాగింది. ప్రస్తుతం షూటింగ్ సెప్టెంబర్ 5 నుంచి మొదలు పెట్టనున్నాము.. అని చెప్పారు. 

కొత్త కథ అందులోనూ క్రైమ్ జోనర్.. చాలా బాగొచ్చింది స్క్రిప్ట్. అందరికీ నచ్చి తీరుతుంది. మంచి పాత్రలు ఇచ్చి ప్రోత్సహిస్తున్న దర్శక నిర్మాతలకు కృతఙ్ఞతలు అని  హీరోయిన్స్ కాశ్మీర, సుమన పూజారి తెలిపారు. 

కిషన్ కె. కె., కాశ్మీర, సుమన పూజారి, పండు, మీనాక్షి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డిఓపి: జి.ఎల్.ఎన్. బాబు, కొరియోగ్రఫీ: భరత్, ఆర్ట్: పి. డేవిడ్, ఫైట్స్: నందు, డైలాగ్స్: ఎమ్. అనురాగ్ విశ్వక్, మధుసూదన్, నిర్మాత: సత్య రెడ్డి, ప్రొడక్షన్ కంట్రోలర్: ఎస్. మంగారావు, స్క్రీన్ ప్లే- డైరెక్షన్: దాసరి లారెన్స్.

Friday Movie Launched:

Minister Harish Rao Clap to Friday Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ