ఆది సాయికుమార్, డైమండ్ రత్నబాబుల ‘బుర్రకథ’ సినిమా ప్రారంభోత్సవం..
రచయిత గా మంచి పేరు సంపాదించుకున్న డైమండ్ రత్నబాబు తొలిసారి డైరెక్టర్ గా రాబోతున్నారు. శుక్రవారం లాంచ్ అయిన ఈ సినిమాలో యంగ్ హీరో ఆది సాయి కుమార్ హీరోగా నటిస్తున్నారు. ‘బుర్రకథ’ అనేది సినిమా టైటిల్. టాలీవుడ్ లోని ప్రముఖ రచయితలు ఈ సినిమా ఓపెనింగ్ కి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ సినిమాలోని హీరో ఫస్ట్ సీన్‌కి క్లాప్‌ని అందించగా, లిరిసిస్ట్, రచయిత అయిన శివ శక్తి దత్తా కెమెరా స్విచ్ఛాన్ చేశారు.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు డైమండ్ రత్నబాబు మాట్లాడుతూ.. ఈ రోజు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నా తోటి రచయితలు, పెద్దలు ఈ సినిమా ఓపెనింగ్‌కి వచ్చి డైరెక్టర్ గా తొలి చిత్రం చేస్తున్న నన్ను ఆశీర్వదించినందుకు. అలాగే ఈ సందర్భంగా నా ప్రొడ్యూసర్స్‌కి థ్యాంక్స్ చెప్తున్నాను. నాకు టాప్ టెక్నిషియన్స్ ని ఇచ్చి సపోర్ట్ చేసినందుకు. కథ చెప్పిన వెంటనే సినిమాని ఓకే చేసి నాపై నమ్మకం ఉంచిన హీరో ఆది సాయి కుమార్ గారికి కృతజ్ఞతలు. ఈ సినిమా ద్వారా స్క్రీన్‌ప్లే రైటర్స్ ని పరిచయం చేస్తున్నాను. వారికి ఈ సినిమా మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను.. అన్నారు..
రచయిత శివ శక్తి దత్త మాట్లాడుతూ, ఈ సినిమా ఓపెనింగ్ కార్యక్రమానికి వచ్చినందుకు సంతోషంగా ఉంది.. ఈ సినిమాలో ఒక పాట రాస్తున్నాను.. ఈ సినిమా సక్సెస్ అయ్యి చిత్ర బృందానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను.. అన్నారు..
హీరో ఆది సాయి కుమార్ మాట్లాడుతూ.. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్. ఈ సంవత్సరంలో ఇది నా మూడో సినిమా.. ఈ మూడు సినిమాలు నాకు ఎంతో ఎక్జయిటింగ్‌గా ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమా చేయడం ఎంతో థ్రిల్‌గా ఉంది. రత్నబాబుగారు మంచి ఫ్రెష్ లైన్‌తో వచ్చారు. ఇందులో నా పాత్ర డిఫరెంట్‌గా చాలా బాగుంది. టాప్ టెక్నిషియన్స్ తో ఈ సినిమా చేయడం ఎంతో హ్యాపీగా ఉంది. అన్నారు..
నిర్మాత శ్రీకాంత్ దీపాల మాట్లాడుతూ.. మా బ్యానర్ లో ఇది రెండో సినిమా.. బుర్రకథ తప్పకుండా ఓ మంచి సినిమా అవుతుంది. డెఫినెట్లీ ఈ సినిమా ద్వారా మా బ్యానర్ కి మంచి పేరొస్తుంది. రేపటినుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. ఇంకో వారంలో సినిమాకి సంబంధించిన హీరోయిన్స్, ఇతర నటీనటులు కన్ఫర్మ్ అవుతారు.. అన్నారు.