గీత గోవిందం సినిమా విడుదలకు మరో పది రోజులు టైం ఉంది అనుకున్న టైములో ఆ సినిమాలోని కొన్ని సీన్స్ ఫొటోస్ లీక్ అవడంతో.. ఆ గందరగోళంలో గీత గోవిందం సినిమా ట్రైలర్ ని కానీ... సినిమాకి ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని కానీ చేయలేకపోయారు. సినిమా విడుదలకు ముందు భారీ క్రేజ్‌తో బరిలోకి దిగిన గీత గోవిందం ట్రైలర్ విషయమే అందరూ మరిచిపోయారు. టీజర్, సాంగ్స్ ని వదిలారు కానీ ట్రైలర్ మాత్రం కొన్ని కారణాల వలన వదలలేదు. కానీ సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో అదరగొట్టే కలెక్షన్స్ తో ఒక రేంజ్లో థియేటర్స్ లో దూసుకుపోతుంది. మే నెలలో.. మహానటి హిట్ తర్వాత మళ్ళీ ఆ రేంజ్ హిట్ గీత గోవిందం అందుకుంది. జీఏ2 పిక్చర్స్ బ్యానర్ నుండి బన్ని వాసు నిర్మాతగా పరశురామ్ తెరకెక్కించిన ఈ సినిమాని కేవలం 13 నుండి 15 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారని టాక్. అయితే ఈ సినిమా ఇప్పుడు మొదటి రోజుకే ప్రపంచవ్యాప్తంగా 9 కోట్ల షేర్ కొల్లగొట్టింది.
అలాగే శాటిలైట్స్ హక్కుల ద్వారా వచ్చిన మొత్తం, మొదటి రోజు వచ్చిన మొత్తానికే గీత గోవిందానికి పెట్టిన పెట్టుబడి వెనక్కి వచ్చేసింది. మరి రెండో రోజునుండి గీత గోవిందం నిర్మాతలు లాభాల బాట పట్టారు. విజయ్ దేవరకొండ క్రేజ్, రష్మిక అందంతో సినిమా సూపర్ హిట్ అవడం.. పరశురామ్ డైరెక్షన్ స్కిల్స్ వావ్ అనిపించేలా ఉండడం.. వెరసి జీఏ2 పిక్చర్స్ బ్యానర్ వారు అదరగొట్టే హిట్ అందుకున్నారు. అందుకే మెగాస్టార్ చిరు కూడా సినిమా విడుదలైన రోజే గీత గోవిందం సినిమా చూసి యూనిట్ సభ్యులను అభినందించారు. ఇక అల్లు అర్జున్ తన మిత్రుడు బన్నీ వాసు గీత గోవిందంతో హిట్ అందుకోవడంతో.. ఇప్పుడు గీత గోవిందం బృందానికి మంచి పార్టీ ఇవ్వడానికి రెడీ అయ్యాడు. గీత గోవిందం సినిమాకి పనిచేసిన దర్శకనిర్మాత, టెక్నీషియన్స్, హీరో హీరోయిన్ ఇలా గీత గోవిందంకి పనిచేసిన ప్రతి ఒక్కరికి అల్లు అర్జున్ తన ఫామ్ హౌస్ లో గ్రాండ్ పార్టీ ప్లాన్ చేశాడట. హైదరాబాద్ శివారులో ఉన్న బన్నీ ఫామ్ హౌస్ లో ఈ పార్టీ జరుగనుంది.
ఇక గీతగోవిందం సినిమా కి ప్రీ రిలీజ్ ఈవెంట్ చెయ్యకపోయినా.. ఇప్పుడు సక్సెస్ మీట్ ని మాత్రం ఓ రేంజ్ లో చేపడుతున్నారు. మెగాస్టార్ చిరు ముఖ్య అతిధిగా గీత గోవిందం సక్సెస్ సెలెబ్రేషన్స్ ని ఆదివారం నిర్వహించబోతున్నారు. మరి సినిమాని ఆల్రెడీ వీక్షించిన చిరు ఈ సక్సెస్ మీట్ లో గీత గోవిందం గురించి ఎలాంటి విషయాలు చెప్పి సినిమాపై మరింత క్రేజ్ పెంచుతాడో అనే ఆసక్తి ప్రస్తుతం అందరిలో ఉంది. ఇకపోతే బన్నీకి సినిమా నచ్చితే ఆ సినిమా బృందానికి పార్టీ ఇవ్వడమనేది మహానటి మూవీ నుండి మొదలు పెట్టాడు. తాజాగా గీత గోవిందం బృందానికి ఇప్పుడు ఇలా పార్టీ ఇస్తున్నాడన్నమాట. ఇక గీత గోవిందం సినిమా కేరళలో కొల్లగొట్టే కలెక్షన్స్ ని అక్కడ కేరళలో వరద బాధిత సహాయార్ధం విరాళంగా ఇచ్చేస్తున్నటుగా ఆ సినిమా నిర్మాత బన్నీ వాసు ప్రకటించాడు.