Advertisementt

చైతూ, సమంతాల మూవీ టైటిల్ ఇదేనంట!

Fri 17th Aug 2018 02:42 PM
naga chaitanya,samantha,new movie,title,majili  చైతూ, సమంతాల మూవీ టైటిల్ ఇదేనంట!
Title Fix for Chaitu and Samantha Combo Movie చైతూ, సమంతాల మూవీ టైటిల్ ఇదేనంట!
Advertisement
Ads by CJ

నాగ చైతన్య - సమంతలు పెళ్లి కాకముందు ఏమాయ చేసావే, ఆటో నగర్ సూర్య, మనం సినిమాలలో జోడిగా నటించారు. అందులో ఆటో నగర్ సూర్య తప్ప మిగతా రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయినవే. అయితే పెళ్లి తర్వాత ఈ జంట నటించబోయే సినిమాపై అందరిలో బోలెడంత క్యూరియాసిటీ నెలకొంది. దర్శకుడు మారుతీ తన శైలజ రెడ్డి అల్లుడు సినిమాలో నాగ చైతన్యకి జోడిగా సమంతని నటింపచేయాలనే ప్రయత్నాలు చేశాడు. కానీ మారుతీ ప్లాన్ వర్కౌట్ అవ్వక.. ఆ సినిమాలో చైతుకి జోడిగా అను ఇమ్మాన్యుయేల్ ని తీసుకున్నాడు. అయితే చైతు - సామ్ ల జంటతో కోన వెంకట్... శివ నిర్వాణ దర్శకత్వంలో ఒక సినిమాని సెట్ చేశాడు.

నాగ చైతన్య - సమంత శివ నిర్వాణ డైరెక్ట్ చెయ్యబోయే సినిమాలో భార్యాభర్తలుగా కనబడనున్నారట. రియల్ లైఫ్ భార్య భర్తలు, రీల్ లైఫ్ లో అవే పాత్రలో కనబడతారంటేనే ఆ సినిమాపై అంచనాలతో పాటుగా క్రేజ్ కూడా పెరిగింది. మామూలుగానే సామ్ - చైతు ల జోడి ఒక సినిమాలో కలిసి నటిస్తే ఆ సినిమాకి ఆటోమాటిక్ గా విపరీతమైన క్రేజ్ హైప్ వచ్చేస్తుంది. ఇకపోతే చైతు - సామ్ లు కలిసి నటిస్తున్న ఈ సినిమా ఎప్పుడో మొదలైంది కానీ... రెగ్యులర్ షూటింగ్ ఇంకా మొదలు కాలేదు.

అయితే ఈ సినిమాకి గతంలో ప్రేయసి అనే టైటిల్ ప్రచారంలోకొచ్చింది. కానీ తాజాగా చైతు - సామ్ లు నటించబోయే  ఈ సినిమా టైటిల్ మజిలి అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. మరి భార్యాభర్తలుగా నటిస్తున్న వీరి జీవితాల్లోకి ఒక అమ్మాయి రావడంతో.. ఆ భార్యాభర్తల మధ్య విభేదాలు రావడం..ఆతర్వాత ఆ సమస్యలను పరిష్కరించుకుని ఒక్కడవడం అనే కథతో ఈ సినిమాని శివ నిర్వాణం తెరకెక్కిస్తున్నాడు. అందుకే ఏ ఈ సినిమాకి మజిలీ అనే టైటిల్ బావుంటుందంటున్నారు. ఇకపోతే ఈ సినిమాలో బాలీవుడ్ నటి దివ్యంశ కౌశిక్ కీలక పాత్రలో నటించనున్న ఈ చిత్రానికి గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు. ఆగస్టు మూడో వారం నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ని మొదలు పెట్టుకోనుంది.

Title Fix for Chaitu and Samantha Combo Movie:

Majili is The Naga chaitanya and Samantha movie Title

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ