Advertisementt

అమితాబ్‌ అందుకే గ్రేట్‌ అనేది..!

Fri 17th Aug 2018 10:19 AM
big b amitabh bachchan,kajol,helicopter eela,special role  అమితాబ్‌ అందుకే  గ్రేట్‌ అనేది..!
Big B Plays his Role in Helicopter Eela అమితాబ్‌ అందుకే గ్రేట్‌ అనేది..!
Advertisement
Ads by CJ

బిగ్‌బి అమితాబ్‌బచ్చన్‌ ఎన్నో విషయాలలో దిగ్రేట్‌ పర్సన్‌ అని ఒప్పుకోవాలి. ఆయనకు కథ, తన పాత్ర నచ్చితే మల్టీస్టారర్స్‌ మాత్రమే కాదు.. ఎలాంటి పాత్రలనైనా, గెస్ట్‌గా, ముసలివాడిగా... ఇలా దేనికైనా రెడీ అంటారు. మన సోకాల్డ్‌ స్టార్స్‌లాగా పక్కవారికి ఎంత ప్రాధాన్యం ఉంటుందో, వారికి ఎలాంటి సీన్స్‌ ఉన్నాయో.. తనకి కూడా అంతే ఉండాలని పట్టుబట్టడు. ఇక ఈ వయసులో కూడా ఆయన వరుస చిత్రాలలో నటిస్తున్నాడు. ఆమద్య అక్కినేని ఫ్యామిలీ చిత్రం ‘మనం’లో తళుక్కున మెరిశాడు. ఇప్పుడు మెగాస్టార్‌ ‘సై..రా నరసింహారెడ్డి’ చిత్రంలో చిరంజీవికి గురువు పాత్ర చిన్నదే అయినా దానిని చేయడానికి ఒప్పుకున్నాడు. కానీ తన పాత్రకి ప్రాధాన్యం లేదని భావించాడేమో బాలకృష్ణ-కృష్ణవంశీల ‘రైతు’ చిత్రంలో నటించమంటే నో చెప్పాడు. 

ఇక ఈయన ప్రస్తుతం మరో అతిధి పాత్రకు ఓకే చెప్పాడు. ఆ చిత్రంలో ఆయన తన నిజజీవిత పాత్రను అంటే అమితాబ్‌బచ్చన్‌గానే నటించనున్నాడు. ఈ చిత్రం పేరు ‘హెలికాప్టర్‌ ఈల’. కాజోల్‌ కీలకపాత్రను పోషిస్తోన్న ఈ చిత్రానికి ప్రదీప్‌ సర్కార్‌ దర్శకత్వం వహిస్తుండగా, స్టార్‌ హీరో అజయ్‌దేవగణ్‌ నిర్మిస్తున్నాడు. కుమారుడు చదివే కళాశాలలోనే సహ విద్యార్ధినిగా చేరిన ఓ తల్లి కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో అతిధి పాత్ర కోసం అమితాబ్‌ని సంప్రదించారు. పాత్ర నచ్చడంతో అమితాబ్‌ కూడా చేసేందుకు ఓకే చెప్పాడు. ఈ సినిమా ట్రైలర్‌ నవ్వుల పూవులు పండిస్తోంది. ఇక అమితాబ్‌ ‘సై...రా’తో పాటు ‘థగ్స్‌ఆఫ్‌ హిందుస్థాన్‌, బ్రహ్మాస్త్ర’ చిత్రాలలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. 

Big B Plays his Role in Helicopter Eela:

Big B special Role in Kajol Helicopter Eela

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ