విజయ్ దేవరకొండ నటించిన ‘గీత గోవిందం’ నిన్న విడుదలైన సంగతి తెలిసిందే. అసలు ఈమూవీ సెట్స్ మీదకు రావడానికి డైరెక్టర్ పరశురామ్ ఎంత కష్టపడ్డాడో చూద్దాం. ఈ కథను పరశురామ్ చాలామంది హీరోస్ కి చెప్పారంట. కానీ ఎవరు ఓకే చెప్పకపోవడంతో ఈ కథను పక్కన పెట్టేసి ‘శ్రీరస్తు శుభమస్తు’ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసారు. ప్రొడ్యూసర్ బన్నీ వాస్‌కు ‘గీత గోవిందం’ చెబితే ఆయన కూడా వెదికి వెదికి దొరక్క, ఎవ్వరూ ఓకే అనక.. బన్నీ వాస్ కూడా దాన్ని పక్కన పెట్టేసి ‘శ్రీరస్తు శుభమస్తు’ని సెట్స్ మీదకు తీసుకొచ్చాడట.
‘శ్రీరస్తు శుభమస్తు’ జరుగుతున్న టైములో బన్నీ ఓ మాట సాయం చేయడంతో విజయ్ కాస్త అయిష్టంగానే ‘గీత గోవిందం’ కథను ఓకే చేశాడట. ‘అర్జున్‌రెడ్డి’ కన్నా ముందు కాబట్టి అతని బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు కొన్ని మార్పులు చేశారట. ఆ టైంలో విజయ్ పక్కన చేయడానికి ఏ హీరోయిన్ ఒప్పుకోలేదట. దాంతో చాలా నెలలు ఈ సినిమాను స్టార్ట్ చేయలేకపోయారు. ఈలోపు ‘అర్జున్‌రెడ్డి’ రిలీజ్ అవ్వడం, విజయ్ ఇమేజ్ పెరగడంతో మరి కొన్ని సీన్లు మార్చారు. ఇక లాస్ట్‌కి ఫైనల్ ప్రొడక్ట్ వచ్చింది.
అప్పుడు విజయ్ ముందు ఈ సినిమా వద్దు ‘టాక్సీవాలా’ను వదులుదాం అని అన్నాడు. నిర్మాతలు అందుకు ఒప్పుకోకపోవటంతో విజయ్ తండ్రి ‘గీత గోవిందం’ సినిమాను చూసి ఇది రిలీజ్ చెయ్యొచ్చు అన్నాక.. ‘గీత గోవిందం’ విడుదలకు మార్గం సుగమం అయింది. అంత అయ్యిపోయింది ఇక సినిమాను రిలీజ్ చేద్దాం అనుకున్న టైములో.. ఈ కథ నాదే అని ఓ అసిస్టెంట్ డైరక్టర్ ఫిర్యాదు చేశాడు. అతనితో రాజీ పడి.. కొంత డబ్బు ఇచ్చి ఆ సమస్యకు ఎండ్ కార్డు వేశారు. మళ్ళి ఈలోపు సినిమా నుండి సీన్స్ బయటికి రావడంతో టీం మొత్తం ఒక్కసారిగా ఖంగుతింది. సరే, ఆ అడ్డంకులు దాటి సినిమాను రిలీజ్ చేశారు. 14 కోట్ల సినిమాకు అయిదు కోట్లే రికవరీ. మిగిలినదంతా ఓన్ రిలీజ్ అనుకుని రిలీజ్ చేశారు. ఇప్పుడు ‘గీత గోవిందం’ సూపర్ హిట్ అయింది. దాంతో డైరెక్టర్ పరశురామ్ ఊపిరి పీల్చుకున్నాడు. అది మ్యాటర్. ఒక్క సినిమాను రిలీజ్ చేయాలంటే డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఎంత కష్టపడాలో.. ఎన్ని సమస్యలు ఎదురుకోవాలో.. ఈ సినిమా విషయంలో అర్ధం అవుతుంది.