Advertisementt

ఈ కమెడియన్‌ మహా చిలిపి వాడండోయ్..

Thu 16th Aug 2018 04:03 PM
vennela kishore,comedians school uniform,tollywood comedians  ఈ కమెడియన్‌ మహా చిలిపి వాడండోయ్..
Tollywood Comedians Back To School ఈ కమెడియన్‌ మహా చిలిపి వాడండోయ్..
Advertisement
Ads by CJ

సునీల్‌ హీరోగా మారిన తర్వాత అలీ, బ్రహ్మానందంల హవా తగ్గిన తర్వాత హీరో స్నేహితునిగా పెద్ద పెద్ద స్టార్స్‌ చిత్రాలలో అత్యధికంగా కనిపించే కమెడియన్లలో వెన్నెల కిషోర్‌ ఒకరు. ఈయన తెరపై హాస్యం పండించడమే కాదు.. నిజజీవితంలో కూడా సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ సమంత నుంచి నాగచైతన్య... ఇలా అందరినీ ఆటపట్టిస్తూ ఉంటాడు. బయట కూడా జోక్‌లు పేల్చి తన చుట్టు పండగ వాతావరణం, సందడి చేస్తుంటాడు. 

తాజాగా ఈయన సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ఓ ఫొటో వైరల్‌ అవుతోంది. ఇందులో తెలుగు కమెడియన్లు చిన్నపిల్లలలాగా, స్కూల్‌ స్టూడెంట్స్‌లా షార్ట్స్‌, టైట్‌ షర్ట్స్‌ వేసుకుని, టైతో విచిత్రంగా కనిపిస్తున్నారు. మన కమెడియన్లు స్కూల్‌కి వెళ్లడం ఏమిటి? అని ఆశ్చర్యపోవద్దు సుమా..! వారంతా స్కూల్‌ యూనిఫాంలో థీమ్‌ పార్టీ చేసుకున్నారు. ‘బ్యాక్‌ టు స్కూల్‌’ పేరుతో థీమ్‌ పార్టీ చేసుకున్న ఈ కమెడియన్లు, పొట్టి నిక్కర్లు, హాఫ్‌ షర్ట్‌లు, టైలు ధరించి భలే కామెడీగా ఉన్నారు. ఫన్నీగా అనిపించే ఈ ఫొటోని వెన్నెలకిషోర్‌ తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశాడు. 

ఈ పార్టీలో ఇలా డ్రస్‌లు వేసుకున్న వారిలో కమెడియన్లు సప్తగిరి, ధన్‌రాజ్‌, రోలర్‌ రఘు, చిత్రం శ్రీను, వేణువండర్‌ వంటి వారు ఉన్నారు. ఈ పార్టీ చేసుకోవడానికి తనకి చిన్న షార్ట్‌ లభించిందని ఈ సందర్భంగా వెన్నెల కిషోర్‌ తెలిపాడు. ఆయన పోస్ట్‌ చేసిన ఫొటో ఇప్పుడు వైరల్‌గా మారింది...! ఇలా ఈ కమెడియన్లు తెరపైనే కాదు.. తెర వెనుక కూడా హాస్యాన్ని పండిస్తూ ఉండటం విశేషంగా చెప్పాలి. 

Tollywood Comedians Back To School:

Vennela Kishore Tweet About Comedians School Uniform

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ