Advertisementt

ఆర్‌ఎక్స్‌ దర్శకుడికి పెళ్లి కూడా కుదిరింది

Wed 15th Aug 2018 01:57 PM
ajay bhupathi,director,rx 100 movie,marriage,childhood friend,sirisha  ఆర్‌ఎక్స్‌ దర్శకుడికి పెళ్లి కూడా కుదిరింది
RX 100 Director Ajay Bhupathi Marriage Fixed ఆర్‌ఎక్స్‌ దర్శకుడికి పెళ్లి కూడా కుదిరింది
Advertisement
Ads by CJ

ఇటీవల కాలంలో 'అర్జున్‌రెడ్డి' తర్వాత అంతటి బోల్డ్‌ కంటెంట్‌తో వచ్చిన 'ఆర్‌ఎక్స్‌100' చిత్రం బడ్జెట్‌పరంగా చాలా చిన్న చిత్రంగా రూపొందినప్పటికీ అతి పెద్ద విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ చిత్రానికి రాంగోపాల్‌వర్మ శిష్యుడు అజయ్‌భూపతి దర్శకత్వం వహించాడు. ఇక గతంలో తనకు మంచి హిట్స్‌ ఇచ్చిన దర్శకులకు బండ్లగణేష్‌ వంటి నిర్మాతలు ఖరీదైన గిప్ట్‌లు ఇచ్చేవాడు. ఆ తర్వాత 'శ్రీమంతుడు', 'భరత్‌ అనే నేను' చిత్రాల ద్వారా తనకి బ్లాక్‌బస్టర్స్‌ అందించిన కొరటాల శివకు కూడా మహేష్‌బాబు గిఫ్ట్‌లు ఇచ్చాడు. 

తాజాగా అజయ్‌భూపతి తమకు కాసుల వర్షం కురిపించినందుకు 'ఆర్‌ఎక్స్‌100' చిత్ర నిర్మాత అయిన అశోక్‌ గుమ్మకుండ ఖరీదైన జీప్‌ కారును గిఫ్ట్‌గా ఇచ్చాడు. తమిళంలో అయితే తరచుగా అజిత్‌, సూర్య, విజయ్‌ వంటి వారు కూడా తమకు బ్లాక్‌బస్టర్స్‌ ఇచ్చిన దర్శకులకు గిఫ్ట్‌లు ఇస్తూ కెప్టెన్‌ ఆఫ్‌ ది షిప్‌గా, నిర్మాతలకు లాభాలు, హీరోలకు హిట్స్‌ అందించే దర్శకులకు గౌరవం ఇస్తూ ఉంటారు. ఇక ఈ చిత్ర దర్శకుడు అజయ్‌భూపతికి 'ఆర్‌ఎక్స్‌100' కారణంగా పెళ్లి కూడా కుదిరి ఓ ఇంటి వాడు కానున్నాడు. ఈ సందర్భంగా అజయ్‌ భూపతి మాట్లాడుతూ, నా చిన్ననాటి స్నేహితురాలు శిరీషను ఈ నెల 25న వివాహం చేసుకోనున్నాను. రెండేళ్ల ముందే నేను శిరీషకి ప్రపోజ్‌ చేశాను. కానీ ఆమె ఇంటి పెద్దలు ఒప్పుకోలేదు. నాకు ఆదాయం లేకపోవడమే దానికి కారణం. దీంతో తాను స్ధిరపడేందుకు రెండేళ్లు సమయం ఇవ్వాల్సిందిగా ఆమె పెద్దలను కోరాను. సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌గా మారుతానని వారికి మాట ఇచ్చాను. దానిని నేడు నిలబెట్టుకున్నాను. 

'ఆర్‌ఎక్స్‌100' తర్వాత శిరీష తల్లిదండ్రులకు నాపై నమ్మకం వచ్చింది. ఈ చిత్రం హిట్‌ టాక్‌ సాధించడంతో వారు సంతోషంగా మా పెళ్లికి అంగీకరించారు. మా వివాహం హైదరాబాద్‌లోనే జరుగుతుంది. మా ఇద్దరిది ఆత్రేయపురమే. శిరీష ప్రస్తుతం బిటెక్‌ చదువుతోంది.. అని చెప్పుకొచ్చాడు. ఇదేదో వినడానికి కూడా సినిమా కథలా ఉందే అని ఎవరికైనా అనిపించడం ఖాయం. ఇలాంటి కథాంశంతోనే చిరంజీవి 'ఛాలెంజ్‌' నుంచి ఎన్నో చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే.

RX 100 Director Ajay Bhupathi Marriage Fixed:

Ajay Bhupathi Marriage With Childhood Friend Sirisha

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ