Advertisementt

'ఎన్టీఆర్'లో చంద్రబాబు వైఫ్ ఎవరో తెలుసా?

Wed 15th Aug 2018 12:37 PM
manjima mohan,nara bhuvaneshwari,ntr biopic,chandrababu wife role,rana daggubati,ntr  'ఎన్టీఆర్'లో చంద్రబాబు వైఫ్ ఎవరో తెలుసా?
Nara Bhuvaneshwari Role set for NTR Biopic 'ఎన్టీఆర్'లో చంద్రబాబు వైఫ్ ఎవరో తెలుసా?
Advertisement
Ads by CJ

క్రిష్ - బాలకృష్ణ కాంబోలో తెరకెక్కుతున్న రెండో సినిమా 'ఎన్టీఆర్' బయోపిక్ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే మొదటి షెడ్యూల్ ని కంప్లీట్ చేసుకుని సెకండ్ షెడ్యూల్ లో పరుగులు పెడుతున్న 'ఎన్టీఆర్' సినిమాపై బయటికొచ్చే న్యూస్ లు సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ గా మారుతున్నాయి. ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ నటిస్తున్న ఈ సినిమాలో మరో కీలక పాత్ర అయినా చంద్రబాబు పాత్రకి హీరో రానా నటిస్తున్నాడు. ఇంకా ఈ సినిమాలో పలువురు సెలబ్రిటీస్ కీ రోల్స్ లో నటిస్తున్నారు. ఎన్టీఆర్ వైఫ్ పాత్రలో విద్యాబాలన్ నటిస్తున్న ఈ సినిమాలో శ్రీదేవి పాత్రకి టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది. ఇక నట, రాజకీయ జీవితాల్లో కీలకమైన ఘట్టాలను మాత్రమే 'ఎన్టీఆర్' బయోపిక్ కోసం వాడుతున్నారని టాక్ ఉంది. అందుకే ఎన్టీఆర్ నట జీవితంలో ముఖ్యమైన వారిని అతిధి పాత్రల్లో ఇప్పటికే ఎంపిక చేస్తున్నారు. 

ఇక 'ఎన్టీఆర్' సినిమాలో ఎన్టీఆర్ కి అల్లుడు అంటే ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి రోల్ ప్లే చేస్తున్న రానాకి ఎన్టీఆర్ బయోపిక్ లో ఇప్పడు జంట దొరికేసిందనే న్యూస్ వినబడుతుంది. చంద్రబాబు భార్య, ఎన్టీఆర్ కి కూతురైన భువనేశ్వరి పాత్రకి ఇప్పుడు హీరోయిన్ ని సెలెక్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. అంటే ఈ సినిమాలో రానా కి పెయిర్ గా భువనేశ్వరికి పాత్రధారిగా 'సాహసం శ్వాసగా సాగిపో' సినిమాలో నాగ చైతన్య కి జంటగా నటించిన హీరోయిన్ మంజిమా మోహన్ చేస్తున్నట్లుగా ఫిలిం నగర్ టాక్. మంజిమా మోహన్ కి 'సాహసం  శ్వాసగా సాగిపో' సినిమా తర్వాత మళ్ళీ తెలుగులో అవకాశం రాలేదు. ఇప్పుడు దర్శకుడు క్రిష్ భువనేశ్వరి పాత్రకి మంజిమని తీసుకున్నాడని చెబుతున్నారు.

ఇక ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 'ఎన్టీఆర్' బయోపిక్ లో టాలీవుడ్ లో మరికొంతమంది హేమ హేమీ నటులు భాగస్వాములవుతున్నారు. ఇకపోతే ఎన్టీఆర్ బయోపిక్ ని శరవేగంగా పూర్తి చేసి వచ్చే సంక్రాంతికల్లా విడుదల చేసే ప్లాన్ లో ఎన్టీఆర్ మేకర్స్ ఉన్నారు.

Nara Bhuvaneshwari Role set for NTR Biopic:

Manjima Mohan to play as Nara Bhuvaneshwari in NTR Biopic

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ