Advertisementt

రిషి, మహర్షి.. ఒక్కరా! ఇద్దరా?

Wed 15th Aug 2018 12:31 PM
maharshi,rishi,mahesh babu,duel role,swadesh  రిషి, మహర్షి.. ఒక్కరా! ఇద్దరా?
Mahesh Babu Dual Roles - Rishi, Maharshi రిషి, మహర్షి.. ఒక్కరా! ఇద్దరా?
Advertisement

మహేష్ బాబు - వంశీ పైడిపల్లి కాంబోలో మొదటిసారిగా తెరకెక్కుతున్న మహర్షి సినిమా ఫస్ట్ లుక్ లో మహేష్ లుక్ కి మంచి ఆదరణ లభించింది. 40 ఏళ్ళ వయసులోనూ ఇప్పటికీ కుర్రాడిలా సారీ.. స్టూడెంట్ లుక్ లో మహేష్ బాబు అదరగొట్టేశాడు. అభిమానులు అనడం కాదుగాని నిజంగానే మహేష్ లుక్ కి మంచి రెస్పాన్స్ ప్రేక్షకుల నుండి వచ్చింది. దిల్ రాజు, పీవీపీ, అశ్వినీదత్ లాంటి హేమ హేమీ నిర్మాతలు నిర్మిస్తున్న ఈ సినిమాపై ట్రేడ్ లోను భారీ క్రేజ్ ఉంది. వంశీ పైడిపల్లి తనకు మహేష్ ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని స్టార్ డైరెక్టర్ అనిపించుకోవాలని ఈ మహర్షి సినిమాని చాలా క్రేజీగా తెరకెక్కిస్తున్నాడు. అయితే మహేష్ బాబు ఈ మహర్షి సినిమాపై అనేకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. మహేష్ బాబు ఎంబీఏ స్టూడెంట్ గా ఉన్నప్పుడు ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న అల్లరి నరేష్.. మహర్షి మూవీ లో రవి (అల్లరినరేష్) తో స్నేహం చేయడం. తర్వాత మహేష్ బాబు విదేశాలకి వెళ్ళిపోయి.. మళ్ళీ స్నేహితుడు రవి ఉన్న పరిస్థితులు తెలుసుకుని ఇండియా రావడం.. స్నేహితుడు రవికి హెల్ప్ చేసే విషయమై వ్యవసాయం విషయంలో రైతులకి అండగా నిలబడడం అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కుతోందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. 

ఇక ఈ సినిమాలో మహేష్ బాబు పేరు రిషి అని రివీల్ అయిన సంగతి తెలిసిందే. అయితే మహేష్ ఈ సినిమాలో మహర్షి అండ్ రిషి గా కూడా నటిస్తున్నాడట. అంటే రిషి గా విదేశాల్లో ఉండే మహేష్ ఇండియాలో స్నేహితునికి సహాయం చేసే క్రమంలో మహర్షిగా మారతాడనే టాక్ ఇప్పుడు సోషల్ మీడియాలో, ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతున్న మహర్షి మూవీ లేటెస్ట్ అప్ డేట్. మరి మహేష్ బాబు డ్యూయెల్ రోల్ ప్లే చెయ్యకపోయినా.. రిషి గా ఒక వేరియేషన్ మహర్షి గా మరో వేరియేషన్ చూపిస్తాడన్నమాట. ఇక ఈ సినిమా లో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న మహర్షి సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇక మహేష్ కూడా అస్సలు రిలాక్స్ అవ్వకుండా ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఇకపోతే మహర్షి సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఉగాది కానుకగా విడుదలకాబోతుంది. 

Mahesh Babu Dual Roles - Rishi, Maharshi:

Maharshi story inspired by Swadesh

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement