పెళ్లిచూపులు, మరీ ముఖ్యంగా అర్జున్‌రెడ్డితో విజయ్‌దేవరకొండ ఓవర్‌నైట్ స్టార్ అయిపోయాడు. ఈ చిత్రం ప్రమోషన్స్ సందర్భంగా ఆయన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వి.హనుమంతరావుని 'చిల్ తాతయ్యా' అంటూ వెక్కిరించి, ఆట పట్టించాడు. ఇక తన ఫ్యాన్స్‌కి ఆయన తనను తాను రౌడీగా ముద్రవేయించుకున్నాడు. ఇక విషయానికి వస్తే నేటి రోజుల్లో సినిమాల విడుదలకు ముందే ఫొటోలు, సీన్స్ లీక్ కావడం రివాజుగా మారింది. 'బాహుబలి' నుంచి 'అత్తారింటికి దారేది, 2.ఓ, అరవింద సమేత వీరరాఘవ' వరకు ఇది తప్పలేదు. విషయానికి వస్తే విజయ్‌దేవరకొండ, రష్మికా మండన జంటగా గీతాఆర్ట్స్2 బేనర్‌లో పరుశురాం దర్శకత్వంలో 'గీతాగోవిందం' చిత్రం విడుదలకు సిద్దం అవుతోంది. ఈనెల 15 ఈ చిత్రం విడుదల కానుండటంతో 'అర్జున్‌రెడ్డి' తర్వాత విజయ్‌దేవరకొండ ఫుల్‌ప్లెజ్డ్ హీరోగా నటించిన చిత్రం ఇదే కావడంతో అర్జున్‌రెడ్డి విజయం తనకి లక్ వల్ల రాలేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత విజయ్‌పై ఉంది. అందునా 'అర్జున్‌రెడ్డి' తర్వాత ఆయన 'మహానటి'లో నటించినా కూడా పూర్తిస్థాయి హీరోగా నటిస్తున్న చిత్రం కావడంతో దీనిపై భారీ అంచనాలు కూడా ఉన్నాయి. తాజాగా ఈ చిత్రంలోని కొన్ని సీన్స్ లీక్ కావడం సంచలనంగా మారింది. ఇలా సీన్స్‌లీక్ కావడంపై విజయ్‌దేవరకొండ ఇన్‌డైరెక్ట్‌గా స్పందించాడు.
నేను చాలా నిరాశకు లోనవుతున్నాను. హర్ట్ అయ్యాను. ఒకసారి కోపం వస్తోంది. మరోవైపు ఏడుపు వస్తోంది... అని ట్వీట్ చేశాడు. దీంతో విజయ్ ఇంతలా బాధపడి ట్వీట్ చేయడానికి కారణం ఏమిటబ్బా అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. సినిమా సీన్స్ లీక్ కావడంతోనే విజయ్ ఇలా ట్వీట్ చేశాడనే అభిప్రాయానికి వస్తున్నారు. దీంతో మరికొందరు అభిమానులు ఎన్ని లీకులు ఎదురైనా మనకి హిట్ గ్యారంటీ అని విజయ్‌కి ధైర్యం చెబుతున్నారు. సాధారణంగా చిన్న, మీడియం రేంజ్ చిత్రాలను ఎవ్వరూ పట్టించుకోరు. అలాంటిది విజయ్ చిత్రంలోని సీన్స్ లీక్ అయ్యాయంటే విజయ్ కూడా స్టార్ హోదా సంపాదించుకున్నట్లేనని, గతంలో ఇలా లీక్ అయిన అనేక చిత్రాలలో ఎక్కువ భాగం విజయం సాధించినవేనని వారు విజయ్‌కి ధైర్యం చెబుతున్నారు. 'చిల్‌రౌడీ. లైట్ తీసుకో' అని సలహాలు ఇస్తున్నారు.
గుంటూరులోని కె.ఎల్ కాలేజీ విద్యార్ధుల వద్ద సినిమా లీక్ సీన్స్ దొరకడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. విచారణలో ఈ సీన్స్ ఎడిటింగ్ విభాగం నుంచే లీక్ అయిందని తేలింది. దీనినిబట్టి ఇది ఇంటిదొంగల పనే అని తేలడం కొసమెరుపు. ఇక విజయ్ తాజాగా కేరళ వరద బాధితులకు తన వంతు సాయంగా 5లక్షలను సీఎం రిలీఫ్‌ఫండ్‌కి విరాళం ఇచ్చాడు. కేరళ వరద బాధితులకు అండగా నిలవాలని అభిమానులను కోరాడు. కేరళ వారు ఎంతో మంచి వారని, కేరళ తనకి ఎంతో ఇష్టమైన ప్రదేశమని తెలిపాడు. ఇక కోలీవుడ్ నుంచి ఇప్పటికే కమల్‌హాసన్, సూర్య, కార్తీ వంటి వారు విరాళాలు అందించారు. ఈ విషయంలో టాలీవుడ్ నుంచి మొదటగా స్పందించింది విజయ్‌దేవరకొండే కావడం విశేషం.