Advertisementt

బాబు అవుట్‌- కౌశల్‌ ఆర్మీ రియాక్షన్!

Wed 15th Aug 2018 12:14 PM
babu gogineni,bigg boss house,nani,koushal,army,happy  బాబు అవుట్‌- కౌశల్‌ ఆర్మీ రియాక్షన్!
Babu Gogineni ELIMINATED From Bigg Boss 2 Telugu బాబు అవుట్‌- కౌశల్‌ ఆర్మీ రియాక్షన్!
Advertisement
Ads by CJ

బిగ్‌బాస్‌ సీజన్‌1లో కత్తిమహేష్‌ ఎలా ఓవర్‌యాక్షన్‌ చేస్తూ వచ్చాడో, బిగ్‌బాస్‌ సీజన్‌2లో హేతువాది పేరుతో బాబుగోగినేని అలానే తయారయ్యాడు అంటూ విమర్శలు వస్తూ ఉన్నాయి. దీనికి తగ్గట్లుగానే ఆయన హౌస్‌లో ప్రవర్తించే తీరుపై బిగ్‌బాస్‌ నాని కూడా తన అసహనం వెలిబుస్తూ ఉన్నాడు. పార్టిసిపెంట్స్‌తో కలిసి గ్రూప్‌లు కట్టడం, ఒకరిపై మరొకరికి చాడీలు చెప్పడం, హౌస్‌లోని వారి మధ్య విబేధాలు సృష్టిస్తూ, గ్రూప్‌రాజకీయాలు చేస్తున్నాడన్న విషయంతో పాటు పార్టిసిపెంట్స్‌లో అందరి అభిమానాన్ని చూరగొంటున్న కౌశల్‌పై ఈయన కత్తి కట్టడం వీక్షకులకు కూడా నచ్చడం లేదు. ఇక ఈమద్య ఆయన హౌస్‌లో ఉంటే తానైనా ఉండాలి... లేదా కౌశల్‌ అయినా ఉండాలని చెప్పడం గమనార్హం. 

ఇలా శపథం చేసినా బిగ్‌బాస్‌ హౌస్‌లోనే కాదు.. బయటికి వచ్చినా కౌశల్‌ని మాత్రం వదిలేది లేదని ఈయన అనడం కౌశల్‌ అభిమానులకు అసలు నచ్చలేదు. ఈ నేపధ్యంలో కౌశల్‌ అభిమానులు బాబుగోగినేని కౌశల్‌ని హెచ్చరించిన తీరుని తట్టుకోలేకపోయారు. బాబుకి వ్యతిరేకంగా ఓట్లు వేసి ఆయనను హౌస్‌ నుంచి బయటకు పంపివేశారు. ఇలా ఈ వారం హౌస్‌ నుంచి బాబుగోగినేని ఎలిమినేట్‌ అయ్యాడు. హౌస్‌లో పెద్దమనిషిలా వ్యవహరిస్తూనే, కౌశల్‌పై ఆయన కక్ష్య కట్టాడు. ఆయన తీరు బయట ఒకలా, లోపల మరోలా ఉందని నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వస్తూ ఉన్నాయి. 

ఇక షో నుంచి బయటికి వచ్చిన గోగినేని బాబు బిగ్‌బాంబ్‌ని రోల్‌రిడాపై ప్రయోగించాడు. దీని ప్రకారం రోల్‌రిడా ఈ వారం అంతా టాయిలెట్లను శుభ్రం చేయాలి. హౌస్‌ నుంచి బయటకు వచ్చిన బాబుగోగినేని మాట్లాడుతూ, హౌస్‌లోకి వచ్చాక ఎంతో ఎంజాయ్‌ చేశాను. మరోసారి ఇలాంటి అవకాశం వస్తుందని భావించడం లేదని తెలిపాడు. మొత్తానికీ బిగ్‌బాస్‌లో బాబుగోగినేని పీడ విరగడైందని కౌశల్‌ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్స్ చేస్తుండటం విశేషం. 

Babu Gogineni ELIMINATED From Bigg Boss 2 Telugu:

Koushal Army Happy with Babu Gogineni ELIMINAtion

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ