Advertisementt

IFFM అవార్డ్ గెలుచుకున్న మ‌హాన‌టి

Tue 14th Aug 2018 10:54 PM
keerthi suresh,mahanati,wins,iffm award  IFFM అవార్డ్ గెలుచుకున్న మ‌హాన‌టి
Mahanati wins IFFM Award IFFM అవార్డ్ గెలుచుకున్న మ‌హాన‌టి
Advertisement
Ads by CJ

తెలుగులో సంచ‌ల‌న విజ‌యం సాధించిన మ‌హాన‌టి ఇప్పుడు విదేశాల్లోనూ స‌త్తా చూపిస్తుంది. ఇండియ‌న్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ ఆఫ్ మెల్ బోర్న్ కు ఎంపికైన మ‌హాన‌టి.. ఈక్వెలిటి ఇన్ సినిమా అవార్డ్ సొంతం చేసుకుంది. మ‌హాన‌టి టీం.. ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్.. హీరోయిన్ కీర్తిసురేష్.. నిర్మాత‌లు స్వ‌ప్న‌, ప్రియాంక ద‌త్ ఆ వేడుక‌కు హాజ‌రై అవార్డును అందుకున్నారు. 

అవార్డ్ స్వీక‌రించిన త‌ర్వాత నిర్మాత స్వ‌ప్న ద‌త్ మాట్లాడుతూ.. ఓ అద్భుత‌మైన చిత్రం నిర్మించి ఈ అవార్డు అందుకున్నందుకు చాలా గ‌ర్వంగా ఉంది. మ‌హాన‌టి కేవ‌లం ఇండియాలోనే కాదు.. విదేశాల్లోనూ అద్భుతమైన విజ‌యం సాధించింది. బాక్సాఫీస్ నెంబ‌ర్స్ దీనికి సాక్ష్యంగా నిలిచాయి. ఈ సినిమా నిర్మించినందుకు చాలా గ‌ర్వంగా ఉంది అన్నారు. 

అవార్డ్ వేడుక త‌ర్వాత ప్ర‌ముఖ బాలీవుడ్ విశ్లేష‌కులు రాజీవ్ మ‌సంద్ తో ఇంట‌ర్వ్యూ కూడా ఇచ్చారు మ‌హాన‌టి యూనిట్. సినిమాకు సంబంధించిన మేకింగ్ విశేషాల‌తో పాటు ఇంకా చాలా విష‌యాలు మీడియాతో పంచుకున్నారు. అంతేకాదు.. మ‌హాన‌టిలో అద్భుత‌మైన న‌ట‌న క‌న‌బ‌ర్చిన కీర్తిసురేష్ ఉత్త‌మ నటి కేట‌గిరీలో నామినేట్ అయ్యారు.

Mahanati wins IFFM Award:

'Mahanati' bags Equality In Cinema Award at Westpac IFFM

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ