Advertisementt

శ్రీదేవి అంటే ఈ డైరెక్టర్ కి ఇంత అభిమానమా?

Tue 14th Aug 2018 10:25 PM
yvs chowdary,fan,sridevi,birth anniversary  శ్రీదేవి అంటే ఈ డైరెక్టర్ కి ఇంత అభిమానమా?
YVS Chowdary Tribute to Sridevi శ్రీదేవి అంటే ఈ డైరెక్టర్ కి ఇంత అభిమానమా?
Advertisement
Ads by CJ

శ్రీదేవి జయంతి సందర్భంగా సంస్మరణ 

'ఆగస్ట్ 13’..

'ఆగస్ట్ 13’వ తేదీ అనే మాట ఎప్పుడు ఎవరి నోట ఎలాంటి సందర్భంలో విన్నా నాకు గుర్తుకు వచ్చేది.. ‘అతిలోక సౌందర్యం’తో పాటు, ‘నవరసాల’ను అవలీలగా‌ పోషించగలిగిన మొట్టమొదటి ఆలిండియా లేడి సూపర్‌స్టార్‌ ‘శ్రీదేవి’గారే.. ఎందుకంటే, ఈరోజు ఆవిడ ‘పుట్టిన రోజు’ కనుక.

నా చిన్న వయసులో ‘బడిపంతులు’ సినిమాలోని ‘బూచాడమ్మా, బూచాడు’ పాటలో బాలనటి ‘శ్రీదేవి’గారిని చూసిన వెంటనే నాలో నాకే తెలియని ఓ ‘ఆకర్షణ’ కలిగిన వైనం. ఆ తరువాత ‘పదహారేళ్ళ వయసు’, ‘వేటగాడు’ సినిమాలలో ఆవిడని చూశాక ఆ ‘ఆకర్షణ’ నుంచి ‘అభిమాని’గా మారిన వైనం. ఇంజినీరింగ్‌ చదువు నిమిత్తం మద్రాసు వెళ్ళాక.. మొదట్లో White Color Fiat Car(TMS 9097)లో, తరువాత Metallic Silver Color Honda Car(TMI 2266)లో ‘శ్రీదేవి’గారు రకరకాల Film Studioల్లోకి Shootingలకు వెళ్తుంటే, ఆ Studioల Gate బయట గంటలకొద్దీ నిలబడి కొన్ని క్షణాలపాటు ఆవిడ్ని చూసుకుంటూ ఆనందపడిన వైనం. ‘జగదేకవీరుడు-అతిలోక సుందరి’, ‘గోవిందా-గోవిందా’ సినిమాలకు సహాయ దర్శకుడిగా (‘నేను మీ వీరాభిమానిని’ అని చెప్పుకోకుండా) పనిజేస్తూ.. పనిపట్ల ఆవిడకున్న సిన్సియారిటీని గౌరవ పూర్వకంగా మరియూ నా ‘అభిమాన దేవత’ని ఆరాధన పూర్వకంగా చాలా దగ్గరగా, రోజుల తరబడి చూసుకుంటూ మురిసిపోయిన వైనం. ‘బోనీకపూర్’‌గారితో ఆవిడ పెళ్ళైయ్యాక హైద్రాబాద్‍ Airportలో ఎదురుపడినప్పుడు.. పరిసరాల్ని, భర్త ‘బోనీకపూర్’‌గారిని చివరకు ఆవిడ Expressionsని సైతం పట్టించుకోకుండా, మన సొంతమనిషికి జాగ్రత్తలు చెప్పినట్లుగా ‘జాగ్రత్తల చిట్టా’ అమాయకంగా చెప్పుకుంటూపోయిన వైనం. చివరగా.. నా గురువు ‘కె. రాఘవేంద్రరావు’గారి ‘సౌందర్యలహరి’ Program Shootకి ఆవిడ వచ్చినపుడు, స్వయంగా కలిసి పులకించిన వైనం. ఇలాంటి ఎన్నో వైనాలు ఆవిడతో పనిజేసిన మరియూ ఆవిడని అభిమానించిన కోట్లాది మందిలోని ప్రతి ఒక్కరికీ ఉంటాయనటంలో ఎలాంటి అతిశయోక్తి ఉండదు. 

నా దృష్టిలో ‘శ్రీదేవిగారు’ అంటే..

‘నమ్మశక్యంగాని’ అందం

‘నమ్మశక్యంగాని’ అభినయం

‘నమ్మశక్యంగాని’ అణకువ

‘నమ్మశక్యంగాని’ ఆకర్షణ

‘నమ్మశక్యంగాని’ వినయం

‘నమ్మశక్యంగాని’ హుందాతనం

‘నమ్మశక్యంగాని’ నట ప్రయాణం (బాలనటి నుండీ లేడి సూపర్‌స్టార్‌ వరకూ & Tollywood నుండీ Bollywood వరకూ ఎదగటం)

‘నమ్మశక్యంగాని’ కుటుంబం (తన మీద ఆధారపడి పెరిగినవాళ్ళు కూడా తనపై, తన ఆస్తులపై కోర్టులకెక్కటం)

‘నమ్మశక్యంగాని’ ప్రేమ వైఫల్యాలు (ఆ అందానికి, ఆ అణకువ, ఆ ఆకర్షణ, ఆ వినయ సంపన్నురాలికి వైఫల్యాలేమిటో అర్ధంగాక పోవటం)

‘నమ్మశక్యంగాని’ పెళ్ళి (చాలా మంది చెవులు కొరుక్కుంటుంటే విన్నదాన్నిబట్టీ ‘రాఖీ కట్టినవాడి చేతే  తాళి కట్టించుకోవాల్సిరావటం’)

‘నమ్మశక్యంగాని’ చావు (ప్రపంచ వ్యాప్తంగా ఉన్న Star Hotelsల్లో నివసించటం చిన్నప్పటి నుంచీ అలవాటుపడ్డా కూడా, ఓ Star Hotel Bath Tub లోనే అనుమానస్పదంగా మృతిచెందటం)

‘నమ్మశక్యంగాని’ అపరాధ పరిశోధన (సందేహాలకు తావిస్తూ ముగించటం)

‘నమ్మశక్యంగాని’ పార్దీవ దేహ సందర్శన మరియూ దహన సంస్కారాల ప్రక్రియ (MGR, NTR, ANR, Jayalalitha ల ప్రక్రియ ఆసాంతం అభిమానుల్ని Live Telecast లో చూడనిచ్చారు. వాటికి భిన్నంగా ఆవిడ పార్దీవదేహా సందర్శన విషయంలో అభిమానులకు ఆంక్షలు విధించటం, Graveyard ప్రవేశం కుటుంబసభ్యులకే పరిమితం చేసి, Graveyard Gateని మూసేసి మరీ దహన సంస్కారాలు కానివ్వటం)

‘నమ్మశక్యంగాని’ బాధ (బాధ అనిపిస్తే ఆవిడ సినిమాలు చూస్తే అభిమానులకు ఊరట దొరికేది, అంటే ఓ రకంగా ఆవిడ Stress Relieve Medicine అన్నమాట. ఇప్పుడా ఆ Medicineకే అకాల మరణం రావటంతో, ఆవిడ తలంపు వచ్చిన్నప్పుడల్లా అభిమానులు పడే బాధ ద్విగుణీకృతమవ్వటం)

చిట్టచివరిగా.. ఆవిడ జీవితంలో నమ్మశక్యంగాని నిజాలు ఎన్నైనా ఉండొచ్చు.. ఆవిడ మరణానికి నమ్మశక్యంగాని కారణాలు ఏవైనా కావచ్చు.. నేను నమ్మే సిద్ధాంతం ఒక్కటే.. ‘ఈ విశ్వంలో ఒకచోట మట్టిని తవ్వితే, ఆ మట్టిని ఇంకో చోట పోయాల్సిందే తప్ప మాయం చేయలేం’.. అంతా కాలమే చూసుకుంటుంది, నిజానిజాల్ని చూపిస్తుంది. దానికి మనం చేయాల్సిందల్లా ఒక్కటే.. ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించటానికి ప్రయత్నించటమే.. ప్రయత్నిద్దాం..

భువి నుండి దివికేగిన అతిలోక సుందరి ‘శ్రీదేవి’గారి పుట్టినరోజు సందర్భంగా ఆవిడ ఆత్మకి శాంతి చేకూరాలని, ఆవిడ కుటుంబ సభ్యులకు మనశ్శాంతి కలగజేయాలని ఆ భగవంతుడ్ని ప్రార్ధిస్తూ..

>ఆవిడ వీరాభిమాని,

>వై. వి. ఎస్. చౌదరి.

YVS Chowdary Tribute to Sridevi:

YVS Chowdary- Fan of Sridevi

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ