>ప్రస్తుతం ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 'అరవింద సమేత వీరరాఘవ' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వేగంగా జరుగుతోంది. ఇటీవల హీరో ఎన్టీఆర్, హీరోయిన్ పూజాహెగ్డేలపై ఓ పురాతన గుడిలో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సన్నివేశాలు చిత్రంలో కీలకమైనవని, ఉత్కంఠను రేపే ఈ సీన్ సినిమాలో ప్రేక్షకులను కట్టిపడేస్తుందని సమాచారం. మరోవైపు తాజాగా ఎన్టీఆర్,పూజాహెగ్డేలపై రైల్వే స్టేషన్‌లో షూటింగ్ జరుపుతున్నారు. జగపతిబాబు, రావు రమేష్, నాగబాబులు ఇందులో కీలకపాత్రను పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని విజయదశమి కానుకగా అక్టోబర్11న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
>ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్, నాగబాబులపై చిత్రీకరించిన సీన్స్‌కి సంబంధించి ఇటీవల కొన్ని ఫొటోలు లీక్ అయ్యాయి. దాంతో త్రివిక్రమ్ యూనిట్ సభ్యులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి యూనిట్‌లోని ఎవ్వరూ షూటింగ్ స్పాట్‌లోకి మొబైల్స్ తీసుకుని రాకూడదని ఆదేశించారు. ఈ చిత్రం ఫస్ట్‌టీజర్‌ని ఆగష్టు15న విడుదల చేయనున్నారు. కానీ తాజాగా సినిమాలోని సీన్స్‌కి సంబంధించిన మరికొన్ని ఫొటోలు లీక్ కావడంతో త్రివిక్రమ్ అండ్ కో తలలు పట్టుకుంటోంది. సీన్స్‌కి సంబంధించిన స్టిల్స్ కావడంతో యూనిట్‌లోని వారే వీటిని తీసి నెట్‌లో పెట్టారనే అనుమానంతో యూనిట్ ఉంది.
Aravinda Sametha photos leaked:
Aravinda Sametha Veera Raghava Stills Leaked Again