నీవు ఎలాంటి వాడివో తెలియాలంటే నీ స్నేహితులను చూపించు అనే సూక్తిఉంది. అలాగే ఓ చిత్రం హిట్టా, ఫట్టా అనేది తెలియాలంటే తదుపరి ఆ దర్శకులకు వచ్చే అవకాశాలను బట్టి ఊహించుకోవచ్చు. ఇక దర్శకుడు హరీష్‌శంకర్, నిర్మాత దిల్‌రాజు, హీరో అల్లుఅర్జున్‌లు తమ 'డీజె'(దువ్వాడ జగన్నాథం) చిత్రంపై వచ్చిన రివ్యూలు, సోషల్‌మీడియాలో ఈ చిత్రానికి వ్యతిరేకంగా జరిగిన ప్రచారం చూసి మీడియాపై మండిపడి తమది నిఖార్సయిన విజయమని చెప్పారు. ఇక ఈ చిత్రం తర్వాత కూడా అల్లుఅర్జున్ నటించి, రచయిత వక్కంతం వంశీని దర్శకునిగా పరిచయం చేస్తూ 'నా పేరు సూర్య..నా ఇల్లు ఇండియా' చిత్రం చేశాడు. ఇది కూడా సరిగా ఆడలేదు. కనీసం 'డిజె' తర్వాత బన్నీ ఓ చిత్రమైనా చేశాడు. కానీ హరీష్‌శంకర్‌కి మరో అవకాశం రాలేదు.
'దాగుడుమూతలు' పేరుతో ఓ కాన్సెప్ట్ ఓరియంటెండ్ మల్టీస్టారర్ చిత్రాన్ని దిల్‌రాజు బేనర్‌లో చేస్తానని చెప్పాడు. కానీ ఇటీవల దిల్‌రాజు మాట్లాడుతూ, ఆ కథ తనకి నచ్చలేదని చెప్పాడు. దాంతో హరీష్‌శంకర్ మరో మార్గం లేక మహేష్‌బాబుతో 'దూకుడు, 1(నేనొక్కడినే), ఆగడు' వంటి చిత్రాలను నిర్మించిన 14రీల్స్ అధినేతలు రామ్, గోపీచంద్, అనిల్‌సుంకల వద్దకు వెళ్లి ఓ కథ చెప్పాడట. ప్రస్తుతం ఈ కథపై చర్చలు సాగుతున్నాయి. ఇక ఆమద్య ఈ నిర్మాతలు ముగ్గురికి విబేధాలు వచ్చాయని ప్రచారం సాగింది. అనిల్‌సుంకర తన ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బేనర్‌లో లోబడ్జెట్ చిత్రాలను నిర్మిస్తున్నాడు. మరి హరీష్‌శంకర్ చిత్రాన్ని ఈ ముగ్గురు నిర్మిస్తారా? లేక అనిల్‌సుంకర సొంతగా నిర్మిస్తాడా? ఆచంట బ్రదర్స్ నిర్మిస్తారా? అనేది వేచిచూడాల్సివుంది.
మరోవైపు 14రీల్స్ పతాకంపై ఈ ముగ్గురు నిర్మాతలు కలిసి వరుణ్‌తేజ్ హీరోగా 'అప్పట్లో ఒకడుండేవాడు' దర్శకుడు సాగర్‌చంద్ర డైరెక్షన్‌లో రమ్యకృష్ణ కీలక పాత్రలో ఓ చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే.