నేములో ఏముంది? అని ఈజీగా కొట్టి పారేయడానికి వీలులేదు. నేములోనే అన్ని ఉన్నాయని సినిమా ఇండస్ట్రీలో అంటూ ఉంటారు. చిరంజీవికి 'ఖైదీ', బాలకృష్ణకి 'సింహా' ఇలా పలు సెంటిమెంట్లు ఉన్నాయి. ఒకనాడు ఎన్ని సినిమాలు విడుదలైనా కూడా సంక్రాంతికి కృష్ణ, ఆ తర్వాత బాలకృష్ణ చిత్రాలు విడుదలైతే హిట్ గ్యారంటీ అనే నమ్మకం ఉండేది. అందుకే ఇండస్ట్రీలో టైటిల్స్‌నే కాదు... నటీనటులు తమ స్క్రీన్‌నేమ్స్‌ని కూడా చాలా సార్లు మార్చుకుంటూ ఉంటారు. లేదా ఇంగ్లీషు అక్షారాలలో ఏదో ఒక లెటర్‌ని యాడ్ చేస్తే లక్‌ని పరీక్షించుకుంటూ ఉంటారు. ఇవి బయటి వారికి నవ్వు తెప్పించినా, ఈ విషయంలో సినిమా వారు మాత్రం సెంటిమెంట్‌ని బాగా నమ్ముతారు.
ఇక విషయానికి వస్తే ఒకనాడు యువచిత్ర పతాకంపై కాట్రగడ్డ మురారి దర్శకత్వంలో కోడిరామకృష్ణ వెంకటేష్, భానుప్రియ గౌతమిలతో 'శ్రీనివాస కళ్యాణం' అనే చిత్రం తీసి మంచి హిట్‌ని కొట్టాడు. అదే టైటిల్‌ని దిల్‌రాజు ఇంత కాలం తర్వాత తన చిత్రానికి పెట్టుకున్నాడు. 'శతమానం భవతి'వంటి అవార్డులు, రివార్డులు పొందిన చిత్ర దర్శకుడు సతీష్ వేగేశ్న దర్శకుడు కావడం, 'దిల్'తో తన ఇంటిపేరునే దిల్‌రాజుగా మార్చుకుని, నితిన్‌తో 'దిల్' వంటి హిట్ సినిమాని తీసి, మరలా ఇంతకాలానికి నితిన్‌తో రెండో చిత్రం తీసిన దిల్‌రాజు నిర్మాత కావడం, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రాలకు బ్రాండ్ అంబాసిడర్ వంటి దిల్‌రాజు తీస్తున్న చిత్రం కావడంతో అందరు ఈ చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఈ చిత్రం మొదటి రోజు కూడా ఓ మోస్తరు కలెక్షన్లు మాత్రమే రాబట్టి రెండోరోజుకి ఫ్లాప్‌గా ముద్ర వేసుకుంది.
దీని ద్వారా సతీష్‌వేగేశ్న, దిల్‌రాజు, నితిన్, రాశిఖన్నాల ఖాతాలో మరో ఫ్లాప్ వచ్చి చేరింది. ఇక దిల్‌రాజు తన తదుపరి చిత్రంగా రామ్‌తో నాగార్జున, అమల నటించిన 'నిర్ణయం' చిత్రంలోని పాపులర్ సాంగ్ 'హలో గురూ ప్రేమకోసమే' అనే టైటిల్‌ని, మహేష్‌బాబుతో వంశీపైడిపల్లితో తీస్తున్న చిత్రానికి ఒకనాడు పెద్దవంశీ తీసిన 'మహర్షి' చిత్రం టైటిల్‌ని రిపీట్ చేయనుండటంతో ఈ రెండు చిత్రాలు దిల్‌రాజుకి ఎలాంటి ఫలితాలను ఇస్తాయో వేచిచూడాల్సివుంది. పాత క్లాసిక్ టైటిల్స్‌ని పెట్టుకునే సమయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో దిల్‌రాజుకి ఇప్పటికైనా అర్ధమై ఉంటుంది.