Advertisementt

మహేష్‌తో మెగా ప్రొడ్యూసర్‌ చరిత్ర సృష్టిస్తాడా?

Tue 14th Aug 2018 10:08 AM
mahesh babu,sandeep reddy vanga,geetha arts,allu aravind,history  మహేష్‌తో మెగా ప్రొడ్యూసర్‌ చరిత్ర సృష్టిస్తాడా?
Mahesh Babu Movie in Geetha Arts Banner మహేష్‌తో మెగా ప్రొడ్యూసర్‌ చరిత్ర సృష్టిస్తాడా?
Advertisement
Ads by CJ

ప్రస్తుతం సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు తన ప్రతిష్టాత్మక 25వ చిత్రంగా దిల్‌రాజు, అశ్వనీదత్‌ల భాగస్వామ్యంలో వంశీపైడిపల్లి దర్శకునిగా 'మహర్షి' అనే చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్‌ కానుకగా ఏప్రిల్‌5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల చేయనున్నారు. దీని తర్వాత మహేష్‌.. సుకుమార్‌ దర్శకత్వంలో '1'(నేనొక్కడినే) ఫ్లాప్‌ అయినా కూడా మరో చిత్రం చేయనున్నాడు. దీనిని ఓటమి ఎరుగని నిర్మాణసంస్థ మైత్రిమూవీమేకర్స్‌ నిర్మిస్తోంది. ఈ చిత్రం గురించి అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ కూడా వచ్చింది. ఇక ఇప్పుడు మహేష్‌ నటించే 27వ చిత్రంపై అందరి దృష్టి పడింది. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌తో చేస్తాడని, కాదు.. కాదు... రాజమౌళితో చేస్తాడని వార్తలు వస్తున్నాయి. 

ఇక త్రివిక్రమ్‌ విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన జూనియర్‌ ఎన్టీఆర్‌ హీరోగా 'అరవిందసమేత వీరరాఘవ' చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం పూర్తయిన వెంటనే ఆయన అల్లుఅర్జున్‌తో హాట్రిక్‌ చిత్రం చేస్తాడని వార్తలు వస్తున్నాయి. ఇక మహేష్‌తో రాజమౌళికి ఓ సినిమా కమిట్‌మెంట్‌ ఉంది. దీనిని దుర్గా ఆర్ట్స్‌ బేనర్‌లో కె.ఎల్‌.నారాయణకు చేయనున్నాడు. కానీ రాజమౌళి దాదాపు వచ్చే వేసవి కంటే ఎక్కువ కాలమే రామ్‌చరణ్, ఎన్టీఆర్‌ల మల్టీస్టారర్‌ పనిలో ఉంటాడు. ఇదే సమయంలో 'అర్జున్‌రెడ్డి'తో ట్రెండ్‌ క్రియేట్‌ చేసిన దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా ప్రస్తుతం ఈ చిత్రం బాలీవుడ్‌ రీమేక్‌లో ఉన్నాడు. ఆయన ఆ చిత్రం పూర్తి చేసుకుని, మహేష్‌ కథపై కూర్చొనే సమయానికి మహేష్‌.. సుకుమార్‌ చిత్రం పూర్తి చేస్తాడు. 

దాంతో మహేష్‌ తన 27వ చిత్రంగా సందీప్‌ వంగా దర్శకత్వంలోనే చిత్రం చేయనున్నాడట. ఇక ఇంతవరకు మెగా ఫ్యామిలీ హీరోలతో తప్ప మరో స్టార్స్‌తోనూ భారీ బడ్జెట్‌ చిత్రాలు తీయని మెగా ప్రొడ్యూసర్‌, గీతాఆర్ట్స్‌ అధినేత అల్లుఅరవింద్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడని తెలుస్తోంది. ఒకప్పుడు 'శివ' చిత్రం ఎలాంటి సంచలన విజయాన్ని సాధించిందో.. సందీప్‌రెడ్డి -మహేష్- అల్లుఅరవింద్‌ల చిత్రం కూడా ఉంటుందని అప్పుడే టాక్స్ మొదలయ్యాయి. ఈ ప్రాజెక్ట్‌ ఓకే అయితే ఈ చిత్రం ఓ సంచలనంగా మిగులుతుందని చెప్పవచ్చు.

Mahesh Babu Movie in Geetha Arts Banner:

Sandeep Reddy Vanga Directs Mahesh Babu in Geetha Arts

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ