క్రీడాకారులు, మరీ ముఖ్యంగా మనదేశంలో మతం కంటే ఎక్కువగా ఆరాధించే క్రికెట్ అభిమానులకు కూడా సినీ రంగంలోని వారంటే క్రేజ్ ఉంటుంది. నాటి నవాబ్‌పటౌడీ, షర్మిలా ఠాగూర్ నుంచి నేటి విరాట్‌కోహ్లి, అనుష్కశర్మల వరకు ఎందరో వివాహబంధంతో ఒకటైతే, మరికొందరి ప్రేమలు ఎఫైర్లతో ముగిశాయి. ఇక మన దేశక్రికెట్ జట్టులో నిన్నటితరం హైదరాబాద్ స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ వి.వి.ఎస్.లక్ష్మణ్ గురించి తెలియని క్రీడాభిమాని ఉండడు. ఆయన మణికట్టుతో చేసే మాయాజాలం స్టైలిష్ ప్లేయర్‌గా, ఇండియన్ క్రికెట్ వాల్‌గా పేరు తెచ్చిపెట్టింది.
ఇక తాజాగా ఆయన తన మనసులోని పలు భావాలను మీడియాతో పంచుకున్నారు. ఈ వివరాలు మీకోసం....విరాట్‌కోహ్లికి, ఇతర బ్యాట్స్‌మెన్‌కి మధ్య నేను గమనించిన తేడా ఏమిటంటే.. కోహ్లి తను ఎగ్జిక్యూట్ చేయాలని భావించిన వాటినన్నింటినీ ఎంతో సమర్ధవంతంగా అమలు చేస్తాడు. అలాగే తన మనసులోని భావోద్వేగాలను కంట్రోల్ చేసుకుంటాడు. అతను మాట్లాడే విధానం బాగుంటుంది. లార్డ్స్‌లో గంగూలీ చొక్కా విప్పి గాల్లోకి తిప్పిన సమయంలో వెంటనే షాక్ అయ్యాను. తర్వాత ఆయన ఎందుకు అలా చేశాడో అర్దమైంది. తెలుగులో చాలా మంది ప్రతిభావంతులైన నటులు ఉన్నారు. నాకు మహేష్‌బాబు, నానిలంటే ఇష్టం. వారి సినిమాలు చూస్తూ బాగా ఎంజాయ్ చేస్తాను. ఇక నా ఫేవరేట్ సెంచరీ విషయానికి వస్తే దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ చేసిన సెంచరీలన్ని ప్రత్యేకమైనవే. నా తొలి శతకం లార్డ్స్‌లో చేశాను. ఈడెన్ గార్డెన్స్‌లో నేను చేసిన 281 పరుగులు నా సెంచరీలలో నాకు ఇష్టమైనవి.
నాకు హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. ప్యారడైజ్ బిర్యానీ అంటే ఇంకా ఇష్టం. భారత గడ్డ మీద ఆస్ట్రేలియా కెప్టెన్ స్మిత్ పూణెలో చేసిన సెంచరీని ది బెస్ట్ అని చెబుతాను. నా ఫోన్ నెంబర్ ఎవ్వరికీ చెప్పను. సారీ. నా ఫేవరేట్ రచయిత జెఫ్రీ అర్చర్. 'జో జీతా వహీ సికిందర్' చిత్రంలోని 'పెహ్లా నషా'పాట నా ఫేవరేట్ సాంగ్. టి20లలో ఎబి డివిలియర్స్, వన్డేలలో కోహ్లి, టెస్ట్‌లలో స్మిత్‌లంటే ఇష్టం. మూడు ఫార్మాట్లకు కలిపి విరాట్‌కోహ్లినే ది బెస్ట్. నన్ను బాగా ఇబ్బంది పెట్టిన బౌలర్ పాకిస్తాన్‌కి చెందిన వసీం అక్రమ్ అని చెప్పుకొచ్చాడు.